ఆస్పత్రికి తరలించే సమయం కూడా లేకుండా సడన్ డెత్‌లు ఇప్పుడు షాక్‌కి గురి చేస్తున్నాయి. క్షణ క్షణానికీ కౌంట్‌డౌనే. ఔను.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కళ్లముందే ప్రాణాలు పోతున్నాయ్.. ఏమైందో తేరుకుని CPR చేసేలోపే జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయ్. ఈ మధ్య కాలంలో ఇలాంటి సడన్ హార్ట్ ఎటాక్‌లు పెరిగిపోయాయి. సికింద్రాబాద్‌లో జిమ్ చేస్తూ విశాల్ చనిపోతే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఓ 28 ఏళ్ల యువకుడు చనిపోయాడు. కె.గంగవరం మండలం యండగండికి చెందిన గ్రామ వాలంటీర్ రాజాబాబుకు 28 ఏళ్లు. ఈనెల 16నే పెళ్లైంది. ఇంతలోనే గుండెపోటుతో అతను చనిపోవడంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది. హార్ట్ ఎటాక్‌తో అతను చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌లో ఉన్నారు. ఇంత అర్థాంతరంగా మృత్యువు మింగేస్తుందని అనుకోలేదంటూ కన్నీరు పెడుతున్నారు.
సికింద్రాబాద్‌లో కానిస్టేబుల్ విశాల్, కోనసీమలో వాలంటీర్ రాజాబాబులు సడన్‌గా హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్టే.. నిన్నటికి నిన్న హైదరాబాద్ కాలాపత్తర్‌లో ఓ వ్యక్తి ఇలానే మరణించాడు. ఓ నిఖాకు హాజరైన రబ్బానీ అనే వ్యక్తి సడన్ డెత్ అందరినీ షాక్‌కు గురిచేసింది. వరుడితో మాట్లాడుతూ, సరదాగా ఉంటూనే క్షణాల్లోనే హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. మనిషి జీవితానికి గ్యారెంటీ లేదని నిరూపిస్తున్నాయి.. ఈ వీడియోలన్నీ చూస్తుంటే మామూలుగా ఫిట్‌గా ఉన్నాం అనుకునే వాళ్లకు కూడా గుండెల్లో దడ పుట్టేలా ఉంది. ఎందుకిలా జరుగుతోంది.. ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్‌లో తేడా వల్లా లేదంటే కరోనా తర్వాత వస్తున్న ఆరోగ్య సమస్యలు దీనికి కారణమా…!! ఎవరూ స్పష్టమైన కారణం చెప్పలేకపోతున్నారు..
పునీత్ రాజ్‌కుమార్ నుంచి నిన్నటికి నిన్న తారకరత్న మరణం వరకూ ఎందుకిలా సడన్‌గా కుప్పకూలిపోతున్నారో తలచుకుంటేనే భయపడేలా ఉంటున్నాయ్ సంఘటనలు. వయసు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారో, స్థూలకాయుల్లోనో గుండెపోటు వచ్చిందనే వార్తలు ఇప్పుడు యువకులకు కూడా పాకడం..
ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..