
అడవిలో తిరగాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. విజయనగరం జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామంలో తిరుగుతున్న పాములు ఎక్కడ ఇళ్లలోకి వస్తాయోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఎం.లింగాలవలసలో 3 పెద్ద.. పెద్ద కొండ చిలువలు దడ పెట్టించాయి. ఊళ్లోకి ఒకేసారి మూడు భారీ కొండచిలువలు రావడంతో గ్రామస్థలు హడలిపోయారు. మనిషికూడా మింగేసేంత సైజులో ఉన్న భారీ కొండచిలువలు చూసి స్టన్ అయ్యారు. పదుల సంఖ్య జనాలు వాటిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపేశారు.
ఎక్కువగా గుబురుగా ఉండే పంటల్లో, దట్టమైన పొదల్లో కొండ చిలువలు తిష్టవేస్తాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. పంట కోసేటప్పుడు కాస్తా శబ్ధం చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు. లేదంటే విషసర్పాల కాటుకు గురి కావాల్సి వస్తుందన్నారు. అయితే కొండ చిలువను నిర్దాక్షణ్యంగా చంపడంపై యానిమల్ లవర్స్ ఫైర్ అవుతున్నారు. అవి కనిపించినప్పుడు స్నేక్ క్యాచర్స్ లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి కానీ.. నోరు లేని జీవాలను గుమికూడి చంపడంపై సీరియస్ అవుతున్నారు.
కొండచిలువలు మనుషులను తినడం చాలా అరుదు. అవి బలంగా చుట్టేయటం ద్వారా ఊపిరి ఆడకపోవడం కానీ గుండె కొట్టుకోవటం ఆగిపోవటం కానీ జరుగుతుంది. ఎంత పెద్ద జంతువునైనా మింగటానికి వీలుగా సాగేలా వాటి దవడల నిర్మాణం ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..