వంట పనికోసం వచ్చారు.. పెళ్లి వారి ఇంటికి చేరుకోక ముందే..!

అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలంవారిపల్లి సమీపంలో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలతో మరో ఇద్దరు బయట పడ్డారు. ఆదివారం(మే 18) తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

వంట పనికోసం వచ్చారు.. పెళ్లి వారి ఇంటికి చేరుకోక ముందే..!
Car Accident

Edited By: Balaraju Goud

Updated on: May 18, 2025 | 7:54 AM

అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలంవారిపల్లి సమీపంలో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలతో మరో ఇద్దరు బయట పడ్డారు. ఆదివారం(మే 18) తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొనివచ్చిన కారు అదుపు తప్పి బావిలోకి బోల్తా పడ్డట్లు స్థానికులు తెలిపారు.

మృతులను కర్ణాటకలోని కోలార్‌కు చెందిన వంట పని వారుగా గుర్తించారు పోలీసులు. బాలంవారిపల్లిలో జరుగుతున్న పెళ్లి వేడుకలో పంట పనులు చేసేందుకు వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని శివన్న, గంగరాజు, లోకేష్ గా గుర్తించగా సునీల్, తిప్పారెడ్డి అనే మరో ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడ్డ కారును క్రేన్ సాయంతో స్థానికులు, పోలీసులు కలిసి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కర్ణాటకలోని కోలార్ నుంచి వంట పనులు చేసేందుకు వచ్చిన ఐదుగురు మరికాసేపట్లోనే బాలంవారిపల్లి చేరుకునే సమయంలోనే ప్రమాదానికి గురి కావడంతో పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..