Krishna District: మాటలకందని విషాదం.. సాంబార్‌లో పడి రెండేళ్ల చిన్నారి మృతి

|

Feb 14, 2022 | 8:42 PM

AP News: కృష్ణా జిల్లా  విసన్నపేట దళితవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  సాంబార్‌లో పడి రెండు సంవత్సరాల చిన్నారి మృతిచెందింది.

Krishna District: మాటలకందని విషాదం.. సాంబార్‌లో పడి రెండేళ్ల చిన్నారి మృతి
Representative Picture
Follow us on

అది కృష్ణాజిల్లా జిల్లా విసన్నపేటలోని దళితవాడ. చూడచక్కని రూపంతో.. ముద్దులొలికే ఈ చిన్నారి పేరు.. తేజస్వి. నిండా రెండేళ్లు కూడా నిండలేదు. తల్లి ఒడిలో ప్రేమను.. తండ్రి చేతుల్లో మమకారం తప్ప వేరే ప్రపంచమే తెలియదు. తన పెద్దనాన్న కూతురి పుట్టిన రోజు వేడుకలతో ఇళ్లంతా సందడిగా మారింది. చుట్టపక్కాలు, బంధువులు వచ్చారు. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అందరూ భోజనాలకు సిద్ధమవుతున్నారు. వడ్డించేందుకు రకరకాల వంటలు రెడీ చేశారు. ఓపెద్ద గిన్నెలో సాంబారు వండారు. ఆ సాంబార్ గిన్నే తమ బిడ్డ పాలిట.. మృత్యు పాశం అవుతుందని.. వాళ్లకు తెలియలేదు. ఓ పక్క భోజనాల తంతు నడుస్తుంటే.. ఆ పాత్రలకు అతి దగ్గరలో పిల్లలంతా ఆడుకుంటున్నారు. వాళ్లతో తేజస్వి కూడా చేరి కేరింతలు కొడుతూ ఆటలాడుతోంది. అవే ఆ చిన్నారి జీవితానికి చివరి ఘడియలు అయ్యాయి. ఆ తల్లిదండ్రులకు అంతులేని విషాద జ్ఞాపకాలను మిగిల్చాయి. అందరితో పాటు ఆడుకుంటున్న ఆ చిన్నారి.. అనుకోకుండా సాంబార్ గిన్నెలో పడింది. పొగలు కక్కుతున్న ఆ సాంబార్‌ వల్ల.. ఆ లేలేత చర్మం ఉడికిపోయింది. ఆ వేడిని తట్టుకోలేక అమ్మా.. అమ్మా అంటూ.. బోరున విలపించింది. పాపను బయటకి తీసేలోపే చర్మం కందిపోయింది.

వెంటనే తిరువూరు ఆస్పత్రికి తరలించారు. పాపకు ఏం కాదు.. ఎలాగైనా బ్రతికిస్తామని డాక్టర్లు చెప్పారు. కానీ రాత్రి 8 గంటలకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. హైక్లాస్ ట్రీట్మెంట్ కావాలి.. లేదంటే పాప బతకడం కష్టమంటూ.. డాక్టర్లు చెప్పిన వార్త విని.. ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంత పని అయింది. పాపను తీసుకుని రెయిన్ బో ఆస్పత్రికి వెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. పాప ప్రాణం గాల్లో కలిసిపోయింది.  తేజస్వి మృతితో కుటుంబంతో తీవ్ర విషాదం నెలకొంది. తమ చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన తమ కూతురు ఇక తిరిగి రాదనే చేదునిజాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.

Also Read: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో

డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్‌ అడిగిన ఐఏఎస్‌..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది