Andhra: ఒకే చోట రెండు రాచనాగులు.. వాటిని చూస్తే వామ్మో…!

గిరి నాగుని.. రాచనాగు, కింగ్ కోబ్రా అని కూడా పిలుస్తారు. ఇవి సహజంగా జనం జోలికి వెళ్లవు. హాని చేయవు. కాకపోతే చూడటానికి భయానకంగా ఉంటాయి. ప్రస్తుతం గిరినాగులకు కలయిక సమయం. అందుకే పదే, పదే అవి జనాలకు తారసపడుతున్నాయి. ఇవి విశాఖ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి.

Andhra: ఒకే చోట రెండు రాచనాగులు.. వాటిని చూస్తే వామ్మో...!
King Cobras

Edited By:

Updated on: Apr 20, 2025 | 3:12 PM

సాధారణంగా పామును చూడగానే వణుకు పుడుతుంది… కొందరికి ఆ పేరు చెప్పగానే భయం వెంటాడుతుంది.. అలాంటిది ఏకంగా 12 అడుగుల భారీ గిరి నాగు కళ్ల ముందు కనిపిస్తే..?! ఒకటి కాదు ఏకంగా రెండు ఒకే చోట మీ కళ్ల ముందు ఉంటే.. కాళ్ల కింద నేల జారుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే అనిపించింది ఆ గ్రామస్తులకు. రెండు మూడు రోజులుగా తీవ్ర భయాప్రాంతులకు గురిచేసిన ఆ రాచనాగులను ఎట్టకేలకు పట్టుకున్నారు.. అడవుల్లో విడిచిపెట్టారు.

అనకాపల్లి జిల్లాలో రెండు భారీ కింగ్ కోబ్రాలు హల్చల్ చేశాయి. స్థానికులను హడలెత్తించాయి. దేవరాపల్లి మండలం మారేపల్లిలో గిరినాగులు కనిపించాయి. స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఒక్కొక్కటి 12 అడుగుల వరకు పొడవు ఉన్న కింగ్ కోబ్రాలు.. రెండు, మూడు రోజులుగా స్థానికంగా తిరుగుతూ రైతుల్లో గుబులు రేపాయి. జతకట్టే సీజన్ కావడంతో.. అలా వచ్చి ఉంటాయని రైతుల భావించారు. వాటి నుంచి దూరం దూరంగా ఉన్నారు. అయితే.. ఓ కల్లం వద్ద ఉన్న పుట్టలో ప్రవేశించాయి ఆ రెండు గిరి నాగులు. దీంతో.. ఫారెస్ట్, ఈస్ట్రన్ ఘాట్స్‌ వైల్డ్‌ లైఫ్‌ సొసైటీకి సమాచారం ఇచ్చారు రైతులు. రంగంలోకి దిగిన ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు.. గంటన్నర పాటు శ్రమించి వాటిని రెస్క్యూ చేశారు. చాకచక్యంగా బంధించిన గిరి నాగులను అడవుల్లో విడిచిపెట్టారు. జతకట్టే సమయం కావడంతో గురినాగులు కనిపించడం సహజమని అంటున్న ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు. సాధారణంగా మనుషులు వాటి జోలికి పోకపోతే ఈ పాములు హాని తలపెట్టవని.. విష సర్పాలను ఆహారంగా తీసుకొని జీవవైవిద్యంలో కీలకపాత్ర పోషిస్తాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు.

వీడియో దిగువన చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..