Andhra: కర్నూలులో మరో ఘోర బస్సు ప్రమాదం.. సీటు మారినందుకు ఓ ప్రాణం దక్కింది.. మరో ప్రాణం పోయింది..

ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మైత్రి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఏపీలోని నంద్యాల జిల్లాలో ప్రమాదానికి గురైంది.. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు..

Andhra: కర్నూలులో మరో ఘోర బస్సు ప్రమాదం.. సీటు మారినందుకు ఓ ప్రాణం దక్కింది.. మరో ప్రాణం పోయింది..
Road Accident

Edited By:

Updated on: Nov 23, 2025 | 7:28 AM

ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మైత్రి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఏపీలోని నంద్యాల జిల్లాలో ప్రమాదానికి గురైంది.. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయి పల్లి మిట్ట దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లెఫ్ట్ సైడ్ లారీ ఆగి ఉంది. బస్సులో ఉన్న ప్రయాణికుడు వాష్ రూమ్ వెళ్లాలని అడగడంతో సరిగ్గా లారీ వెనుక బస్సు ఆగింది. ప్రయాణికుడు దిగగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ బస్సును ఢీకొంది. ముందు ఉన్న బస్సును లారీ డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు లారీల మధ్యన బస్సు ఇరుక్కుపోయింది. బస్సులో వెనుక వైపున ఉన్న ఎఫ్ ఫోర్ అండ్ ఎఫ్ సిక్స్ బెర్త్ లో ఉన్న బద్రీనాథ్, హరిత అనే ఇద్దరు మృత్యువాత పడ్డారు.

వాస్తవానికి హరిత ఎఫ్2 లో ఉండాల్సి ఉంది.. ఎఫ్ ఫోర్ లో నరసింహారెడ్డి అనే ప్రయాణికుడు ఉన్నాడు.. అయితే.. బస్సు ప్రయాణం మొదలైన అనంతరం.. హరిత ఎఫ్2 నుంచి F4 కి షిఫ్ట్ అయింది. ఈ ఘటనలో నరసింహారెడ్డి ప్రాణాలు దక్కించుకోగా.. హరిత మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఎఫ్ ఫోర్ అండ్ ఎఫ్ సిక్స్ ఒకే బెర్త్. ఈ బెర్త్ లో ఉన్న ఇద్దరు బద్రీనాథ్, హరిత మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

వీరిద్దరూ హైదరాబాదు ఉప్పల్ లో బస్సు ఎక్కారు. వీరిద్దరూ ఎవరు.. ఏం చేస్తుంటారు ఎక్కడి వారు అనే వివరాలు ఒక పూర్తిగా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులకు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు 9121101166 నెంబర్ కు సంప్రదించాలని కోరారు.

లారీ బలంగా ఢీకొట్టడంతో… బస్సు పూర్తిగా డ్యామేజ్ అయింది. గాయపడిన బాధితులను నంద్యాల ఆర్లగడ్డ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రమాద స్థలాన్ని నంద్యాల ఎస్పీ సునీల్ శరన్, డీఎస్పీ ప్రమోద్, సీఐ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..