King cobra : విశాఖ జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం.. పరుగులు పెట్టిన జనం.. చివరకు ఏం చేసారంటే..

పాములను చూస్తే వణికిపోతాం మనం. అలాంటిది ఓ భారీ కింగ్ కోబ్రా ఎదురుపడితే.. తాజాగా ఓ కింగ్ కోబ్రా ప్రజలను భయాందోళనకు గురిచేసింది. విశాఖ జిల్లాలో కింగ్ కోబ్రా కలకలంరేపింది.

King cobra : విశాఖ జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం.. పరుగులు పెట్టిన జనం.. చివరకు ఏం చేసారంటే..
King Cobra

Updated on: Apr 12, 2021 | 9:40 PM

సాధారణంగా పాములను చూస్తే వణికిపోతాం మనం. అలాంటిది ఓ భారీ కింగ్ కోబ్రా ఎదురుపడితే.. తాజాగా ఓ కింగ్ కోబ్రా ప్రజలను భయాందోళనకు గురిచేసింది. విశాఖ జిల్లాలో కింగ్ కోబ్రా కలకలంరేపింది. మాడుగుల నూకాలమ్మ కాలనీలో కొత్త అమావాస్య కావడంతో స్థానికులు నూకాలమ్య జాతరకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో భారీ కింగ్ కోబ్రా కనిపించింది.. దానిని చూడగానే జనాలు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్ పి.వెంకటేశష్ గిరి నాగును చాకచక్యంగా పట్టుకున్నారు.

ఈ భారీ కింగ్‌కోబ్రా 12 అడుగుల పొడవు, 5 కేజీల బరువుంది. అటవీ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో దానిని తాటిపర్తి పంచాయతీ శివారు గరికబంద అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ గిరినాగులు…హాని చేయవని.. ఎవరూ కంగారుపడాల్సిన పని లేదని చెప్పారు అటవీ శాఖ అధికారులు. తొందరపడి ఆ పాములను చంపడం కానీ హింసించడంకాని చేయవద్దని తెలిపారు. ఎవరికైనా ఇలాంటి సర్ప జాతులు కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Reduce Face Fat: ముఖం, గెడ్డం దగ్గర కొవ్వు పేరుకుందా.. సింపుల్ చిట్కాలను ఫాలోకండి

Telangana: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపశృతి… వంట వండుదామని కట్టెల పొయ్యి వెలిగించడంతో…

tirupati tension: చంద్రబాబు రోడ్‌ షోలో రాళ్ల దాడి.. మహిళతో సహా ఇద్దరికి గాయాలు.. రోడ్డుపై బైఠాయించి బాబు నిరసన