Vijayawada: బస్టాండ్‌లో తేడాగా కనిపించిన ప్రయాణీకుడు.. అతడి లగేజ్ చెక్ చేయగా షాక్

|

Apr 03, 2023 | 3:17 PM

ఇలా తయారయ్యారు ఏంట్రా బాబు అనిపిస్తుంది ఈ కేటుగాళ్ల స్కెచ్చులు చూస్తుంటే. ఏకంగా ఆర్టీసీ బస్సుల్లోనే మత్తు రవాణాకు పూనుకుంటున్నారు. కొంచెం కూడా భయం లేకుండా అక్రమ రవాణా షురూ చేస్తున్నారు.

Vijayawada: బస్టాండ్‌లో తేడాగా కనిపించిన ప్రయాణీకుడు.. అతడి లగేజ్ చెక్ చేయగా షాక్
Vijayawada Bus Stand
Follow us on

మత్తు జీవితాలను చిత్తు చేస్తుంది. అయినా ఎవరు వింటున్నారు చెప్పండి. మందు పక్కనబెట్టండి.. ఇప్పుడు గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. పట్నాలు మాత్రమే కాదు పల్లెలకు కూడా విస్తరించింది. యూత్ పెద్ద ఎత్తున గంజాయికి అలవాటు పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నాయి. అయినప్పటికీ స్మగర్లు వెనక్కి తగ్గడం లేదు. అరెస్టై.. జైల్లో చిప్ప కూడు తిని వచ్చినా సరే.. అదే దందా కంటిన్యూ చేస్తున్నారు.

తాజాగా విజయవాడ బస్టాండ్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమ రవాణాకు యత్నించిన ఒక వ్యక్తి నుండి 14.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు తమిళనాడుకు చెందిన తంగరాజు పళని స్వామి (39)గా గుర్తించి..  అరెస్టు చేసి అతనిపై ఎన్‌డిపిఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 17 వద్ద చెన్నై బస్సు ఎక్కేందుకు వేచి ఉన్న ఒక ప్రయాణికుడు.. కాస్త తేడాగా ప్రవర్తించడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని.. లగేజీని తనిఖీ చేయగా, లోపల గంజాయి కనిపించింది. గంజాయి స్టాక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడు స్వామిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అన్నవరంలో మధ్యవర్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి చెన్నైలోని మరో వ్యక్తికి డెలివరీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి ఇచ్చిన వ్యక్తి కోసం వెతుకులాట జరుపుతున్నామని వివరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..