
అనకాపల్లి జిల్లాలో మరో భారీ కలకలం సృష్టించింది. ఇంటి ప్రహారికి, గోడకు మధ్య వచ్చి చేరింది. అక్కడే ఉన్న ఇంటి పనులు తీసేందుకు ఆ కుటుంబ సభ్యులకి.. ఇందులో ఏదో వెళ్తున్నట్టు గుర్తించారు. కింగ్ కోబ్రాన్ని చూసి హడలెత్తిపోయారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని గరిసింగి గ్రామంలో ఈ భారీ కింగ్ కోబ్రా కనిపించింది. సుమారు 13 అడుగుల పొడవుగల భారీ గిరినాగు.. రెండు ఇళ్ల గోడల సందులోకి వచ్చి చేరింది. పాము అక్కడే ఉందనే సంగతి తెలియని స్థానికులు.. అక్కడున్న ఇటుకల కోసం వెళ్లారు. అదే సమయంలో సందులో దూరుతున్న గిరినాగును చూసి హడలిపోయారు.
వణికి పోయిన స్థానికులు.. వెంటనే.. చోడవరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు.. ఆ సమాచారాన్ని తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులకు చేరేవేశారు. దీంతో తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు ప్రసాద్, కృష్ణ, ఇషాక్ గరిసింగి గ్రామానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి భారీ గిరినాగును రెస్క్యూ చేశారు. అనంతరం ఆ గిరినాగును చీడికాడ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే.. రెస్క్యూ చేసే క్రమంలో.. గిరినాగు పెద్దగా బుసలు కొడుతూ.. స్నేక్ క్యాచర్‌ల పైనే తిరగబడింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..