Vijayawada: అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత

|

Aug 26, 2024 | 8:52 PM

10 ఏళ్ల బాలుడికి ఆడుకుంటూ ఉండగా తేలు కుట్టింది. అయితే అమ్మ తిడుతుందని.. నాన్న కొడతాడని బాలుడు ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. అదే పెను ప్రమాదాన్ని తీసుకువచ్చింది.

Vijayawada: అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత
Scorpion
Follow us on

బెజవాడలో విషాద ఘటన వెలుగుచూసింది. తేలు కుట్టి పదేళ్ల బాలుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం చరణ్ అనే బాలుడు ఆడుకుంటుండగా తేలు కుట్టింది. అయితే ఇంట్లో ఏమైనా అంటారేమో అని బాలుడు బాధను దిగమింగి విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.  పెయిన్ ఎక్కువ అవ్వడంతో.. తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో.. వెంటనే బాలుడ్ని ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. తేలు విషం ఒళ్లంతా పాకి.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాలుడు ఆగష్టు 26, సోమవారం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది.

తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే విషం విరిగిపోతుందా ??

తేలు కుడితే అదే తగ్గిపోతుందిలే అనే అలసత్వం వద్దు. పాముతో పోల్చుకుంటే తేలు విషం పాళ్లు తక్కువ.  అయినా సరే ప్రాణం పోయే ప్రమాదం లేకపోలేదు. తేలు కుట్టగానే.. కుట్టిన ప్రదేశంలో తీవ్రమైన మంట, నొప్పి ఉంటాయి.  తేలు కాటుకు వెంటనే చికిత్స అందిస్తే డేంజర్ ఏం ఉండదు. చాలామంది నాటు వైద్యుల్ని ఆశ్రయించి.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.

తేలు కుట్టిన వెంటనే ఉల్లిపాయ సగానికి కోసి..  కుట్టిన చోట 5 నిమిషాలు రుద్దితే  విషం విరిగిపోతుందని కొందరు చెబుతుంటారు. ఇది నిజం కాదు.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఉల్లిపాయలో కొన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్నప్పటికీ.. ఇది తేలు కాటుకి సమర్ధవంతంగా పనిచేయకపోవచ్చు. మీరు ఇలాంటి సోషల్ మీడియా చిట్కాలను నమ్మి.. చికిత్స తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..