యూరప్ లో కరోనా విలయం.. లక్ష దాటిన మరణాలు

| Edited By: Anil kumar poka

Apr 19, 2020 | 1:43 PM

యూరప్ దేశాల్లో కరోనా తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. ఇటలీ, స్పెయిన్ దేశాలు ఇంకా ఈ రాక్సీ గుప్పట్లో నలుగుతూనే ఉన్నాయి. ఇటలీలో 23,227, స్పెయిన్ లో 20, 043 కరోనా మరణాలు సంభవించాయి. ఫ్రాన్స్ లో 19, 323 మంది రోగులు మృతి చెందగా..

యూరప్ లో కరోనా విలయం.. లక్ష దాటిన మరణాలు
Follow us on

యూరప్ దేశాల్లో కరోనా తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. ఇటలీ, స్పెయిన్ దేశాలు ఇంకా ఈ రాక్సీ గుప్పట్లో నలుగుతూనే ఉన్నాయి. ఇటలీలో 23,227, స్పెయిన్ లో 20, 043 కరోనా మరణాలు సంభవించాయి. ఫ్రాన్స్ లో 19, 323 మంది రోగులు మృతి చెందగా.. బ్రిటన్ లో 15 వేలకు పైగా మృత్యు బాట పట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 2, 289,500 మందికి పాజిటివ్ లక్షణాలు కనిపించాయని, ఇందులో ఒక్క యూరప్ లోనే లక్షకు పైగా రోగులు మృతి చెందారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన 157, 539 మరణాలతో పోలిస్తే.. ఇందులో సుమారు మూడింట రెండు వంతుల మంది యూరప్ దేశాల వారేనని లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో సుమారు 38 వేల మంది మరణించినట్టు జాన్స్ హాఫ్ కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. చైనాలో మృతుల సంఖ్య 4,632 కి చేరింది. అయితే ఈ సంఖ్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చైనా కావాలనే తన కరోనా మరణాల రేటుపై రోజుకో రకంగా ప్రకటనలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అనేక దేశాలు సీరియస్ కేసులనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. స్పెయిన్ దేశ వ్యాప్త లాక్ డౌన్ ని మే 9 వరకు పొడిగించింది. జపాన్, బ్రిటన్, మెక్సికో దేశాలు సైతం  తమ ఆంక్షల గడువును పొడిగించాయి. అయితే స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఫిన్లాండ్ దేశాల్లో షాపులు తెరచుకొనున్నాయి. ఈ దేశాల్లో కరోనా మహమ్మారి కొంతవరకు శాంతించింది. జర్మనీలో 3,400 మంది కరోనా రోగులు మృతి చెందారు. కానీ  మరణాల రేటును తగ్గించడానికి తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. అటు-అమెరికాలో లాక్ డౌన్ ని పట్టించుకోవద్దంటూ సాక్షాత్తూ అధ్యక్షుడు ట్రంప్ పిలుపునివ్వడంతో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వఛ్చి తమ నిరసన కొనసాగించారు. రష్యాలో కొత్తగా 4,785 కరోనా కేసులు నమోయ్యాయి.313 మంది మరణించారు.