Vivek Murthy: భారత సంతతి వైద్యుడికి మరో గొప్ప అవకాశం… సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి తిరిగి నియామకం

|

Mar 24, 2021 | 8:31 AM

అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవికి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి ఎంపికయ్యారు.

Vivek Murthy: భారత సంతతి వైద్యుడికి మరో గొప్ప అవకాశం... సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి తిరిగి నియామకం
Dr.vivek Murthy As Us Surgeon General
Follow us on

Doctor Vivek Murthy: అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవికి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి ఎంపికయ్యారు. బరాక్ ఒబామా హయాంలో డాక్టర్ వివేక్ మూర్తిని అమెరికా సర్జన్ జనరల్‌గా నియమించారు. అనంతరం డోనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టాక 2017లో వివేక్ మూర్తిని తొలగించి.. ఆయన స్థానంలో అమెరికాకు చెందిన వ్యక్తికి అప్పగించారు. మూర్తి కమిషన్డ్ కోర్ సభ్యుడిగా మాత్రం సేవలు అందించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో వివేక్ మూర్తికి యుఎస్ ప్రెసిడెంట్ బిడెన్ సర్జన్ జనరల్ కీలక బాధ్యతలు అప్పగించారు. దీనికి అమెరికా సెనేట్ మంగళవారం ఓటు వేసింది. భారతీయ అమెరికన్‌ను బిడెన్ సర్జన్ జనరల్‌గా నిర్ధారించడానికి సెనేటర్లు 57-43 ఓటు వేశారు.

ఈ సందర్భంగా వివేక్ మూర్తి మాట్లాడుతూ.. “అమెరికా సర్జన్ జనరల్‌గా మరోసారి పనిచేయడానికి సెనేట్ ధృవీకరించినందుకు నేను చాలా కృతజ్ఞుడను. గత సంవత్సరంలో మేము ఒక దేశంగా గొప్ప కష్టాలను భరించాము. అమెరికాలో కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని వివేక్ మూర్తి ట్వీట్ చేశారు. అమెరికా లాంటి దేశానికి ఆరోగ్య విషయాలు చూసుకోవాలని అధ్యక్షుడు అడిగారని, ఇండియాకు చెందిన ఒక పేద రైతు మనవడికి చాలా గౌరవమని మూర్తి పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం వలస వచ్చిన తన కుటుంబాన్ని ఆదరించి, సేవ చేసే అవకాశం కల్పించినందుకు అమెరికాకు రుణపడి ఉంటానని చెప్పారు.


రిపబ్లికన్ల సెనేటర్లు బిల్ కాసిడీ, సుసాన్ కాలిన్స్, రోజర్ మార్షల్, లిసా ముర్కోవ్స్కి, రాబ్ పోర్ట్మన్, మిట్ రోమ్నీ మరియు డాన్ సుల్లివన్ మంగళవారం వివేక్ మూర్తి నామినేషన్కు మద్దతుగా నిలిచారు.

Read Also…  ఏపీ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం.. షటిల్ ఆడుతూ కుప్పకూలిన సీఐ భగవాన్.. అక్కడిక్కడే గుండెపోటుతో మృతి..!