5

కరోనా భూతం.. అమెరికాలో ఒక్క రోజే 3 వేల మంది బలి

అమెరికాలో కరోనా భూతం కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే సుమారు 3 వేల మంది కరోనా రోగులు మరణించారు. గత నెల 30 న కేవలం 24 గంటల్లో 2,909 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది వీధుల్లోకి వఛ్చి...

కరోనా భూతం.. అమెరికాలో ఒక్క రోజే 3 వేల మంది బలి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 03, 2020 | 12:47 PM

అమెరికాలో కరోనా భూతం కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే సుమారు 3 వేల మంది కరోనా రోగులు మరణించారు. గత నెల 30 న కేవలం 24 గంటల్లో 2,909 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది వీధుల్లోకి వఛ్చి ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తుండగా మరోవైపు కరోనా తన ప్రతాపం చూపింది. యుఎస్ లో ఒక్కరోజే ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 23 న 2,471 మంది మృతి చెందారని పేర్కొంది. తాజా మరణాలు ఆ సంఖ్యను మించిపోయాయని వ్యాఖ్యానించింది. దేశ ఎకానమీని పునరుజ్జీవింపజేసేందుకు కొన్ని చోట్ల స్టే ఎట్ హోం ఉత్తర్వులను సడలించాలని, వ్యాపార కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుండగా…. ఇదే అదనని జనాలు పోటెత్తారు. ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, తమ హక్కులకు భంగం కలిగిస్తున్న లాక్ డౌన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డే లేకపోయింది. లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ కనీసం 10 రాష్ట్రాల్లో నిరసనకారులు ఆందోళనలు చేశారు. కాలిఫోర్నియా, కొలరాడో, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, న్యూజెర్సీ, న్యూమెక్సికో, న్యూయార్క్, టెనెసీ, వాషింగ్టన్ రాష్ట్రాల్లో వీరు ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. ఒక దశలో స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ వీరిని ఉత్సాపరచేట్టుగా తన వైట్ హౌస్ బ్రీఫింగ్స్ లో చేసిన వ్యాఖ్యలు కూడా వీరిని మరింత ఉత్తేజితం చేశాయి. ఎకానమీని పునరుధ్ధరించుకోవాలంటే.. కరోనా కన్నా ముందు బిజినెస్ కార్యకలాపాలను ప్రారంభించాలని ఆయన దాదాపు పిలుపునివ్వడం విశేషం.