అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం.. బార్ వద్దే ఘోరం

| Edited By: Anil kumar poka

Jan 20, 2020 | 6:20 PM

అమెరికాలోని కన్సాస్ సిటీలో ఓ బార్ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. 15 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ బార్ లోకి ప్రవేశించడానికి వెయిట్ చేస్తున్నవారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.  ఈ ఘటనలో ఒక మహిళతో బాటు మరొకరు మృతి చెందారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ దుండగుడు కూడా మరణించాడు.  నగరంలోని ఓ స్టేడియంలో టెనె సీ టైటన్స్ తో జరిగిన పోటీల్లో ఈ నగర చీఫ్ ఆధ్వర్యాన  గల […]

అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం.. బార్ వద్దే ఘోరం
Follow us on

అమెరికాలోని కన్సాస్ సిటీలో ఓ బార్ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. 15 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ బార్ లోకి ప్రవేశించడానికి వెయిట్ చేస్తున్నవారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.  ఈ ఘటనలో ఒక మహిళతో బాటు మరొకరు మృతి చెందారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ దుండగుడు కూడా మరణించాడు.  నగరంలోని ఓ స్టేడియంలో టెనె సీ టైటన్స్ తో జరిగిన పోటీల్లో ఈ నగర చీఫ్ ఆధ్వర్యాన  గల జట్టు గెలుపొందిన సందర్భంగా అతడిని గ్రీట్ చేసేందుకు ఈ బార్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అయితే హఠాత్తుగా ఓ ఆగంతకుడు గన్ తో వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవలే టెక్సాస్ లో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా దుండగుడు వాడిన గన్  స్థానికంగా తయారైనది కాదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.