Donald Trump: చిక్కుల్లో పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. ఫెడరల్‌ కోర్టులో కేసు

|

Feb 17, 2021 | 11:54 AM

Donald Trump:  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చిక్కుల మీద చిక్కులు వచ్చి పడుతున్నాయి. ట్రంప్‌పై సెనేట్‌లో అభిశంసన వీగిపోయిందనుకునే సరికి మరో ....

Donald Trump: చిక్కుల్లో పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. ఫెడరల్‌ కోర్టులో కేసు
newyork prosecutor says inquiry now criminal capacity
Follow us on

Donald Trump:  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చిక్కుల మీద చిక్కులు వచ్చి పడుతున్నాయి. ట్రంప్‌పై సెనేట్‌లో అభిశంసన వీగిపోయిందనుకునే సరికి మరో చిక్కుల్లో పడ్డారు. జనవరి 6న క్యాపిటల్‌పై దాడిని ప్రోత్సహించడం ద్వారా ట్రంప్‌ ‘కూ క్లుక్స్‌ క్లాస్‌’ చట్టం అతిక్రమణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీనియర్‌ డెమోక్రటిక్‌ నేత భిన్నీ థాంప్సన్‌ ఫెడరల్‌ కోర్టులో కేసు వేశారు. ట్రంప్‌తో పాటు ఆయన న్యాయవాది రూడి గిల్యానీ సహా వారి మద్దతుదారులూ చట్టాన్ని ఉల్లంఘించారని బిన్నీ థాంప్సన్‌ పేర్కొన్నారు. ఈ కూ క్లుక్స్‌ క్లాన్‌ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చట్టం ఆఫ్రికన్‌ అమెరికన్ల ఓటు హక్కులను రక్షణ కల్పించేలా ఆ దేశ అధ్యక్షుడికి ఆధారాలు కల్పిస్తూ 1871 సివిల్‌ వార్‌ సమయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో డైబెన్‌ ధృవీకరణ ప్రక్రియలో భాగంగా నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా ఉండేందుకు వారు బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే అధ్యక్షుడిగా బైడెన్‌ ధృవీకరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ క్యాపిటల్‌ భవనంపై దాడి చేస్తూ కూ క్లుక్స్‌ చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ న్యాయవాది గిల్యానీ సహా రెండు ఇతర గ్రూపులు హింసాత్మక అల్లర్లతో కాంగ్రెస్‌ సభ్యులకు తీవ్రమైన ముప్పును సృష్టించారని థాంప్సన్‌ ఆరోపించారు. వంద మంది సభ్యులున్న సెనేట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటేశారు. దీంతో సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ట్రంప్‌పై అభిశంసన అభియోగాలు వీగిపోయాయి.

Also Read: Jacu Bird Coffee: పక్షి రెట్టలతో కాఫీ.. టేస్ట్‌లో ఎవరెస్ట్.. ఈ కాఫీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ మీ కోసం