కరోనాను తక్కువగా అంచనా వేశా, డొనాల్డ్ ట్రంప్

| Edited By: Anil kumar poka

Sep 10, 2020 | 2:16 PM

కరోనా వైరస్ ముప్పును తక్కువగా అంచనా వేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు. ఇది అల్లాటప్పా వ్యాధి, నాలుగు రోజులు ఉండి పోతుందని అనుకున్నానని, కానీ నిజానికి ఇది భయంకరమైనదేనని అన్నారు.

కరోనాను తక్కువగా అంచనా  వేశా, డొనాల్డ్ ట్రంప్
Follow us on

కరోనా వైరస్ ముప్పును తక్కువగా అంచనా వేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు. ఇది అల్లాటప్పా వ్యాధి, నాలుగు రోజులు ఉండి పోతుందని అనుకున్నానని, కానీ నిజానికి ఇది భయంకరమైనదేనని అన్నారు. దీన్ని పెద్ద ‘బూచి’ గా చూపి హడావుడి చేస్తే.. అమెరికన్లలో భయాందోళనలు తలెత్తుతాయని. ఇక ‘పానిక్ ‘ గురించి చెప్పేదేముందన్నారు. ఈ దేశానికి నేను ఛీర్ లీడర్ని.. ఈ దేశాన్ని ప్రేమించేవాడ్ని.. ప్రజలు భయపడకూడదని భావించే..భీతావహ పరిస్థితిని సృష్టించరాదన్నదే నా ఉద్దేశం అన్నారాయన. ఈ వైరస్ మన ఫ్లూ కన్నా భయంకరమైనది.. అని మొత్తానికి పేర్కొన్నారు.

బాబ్ వుడ్ వర్డ్ న్యూ బుక్’ రేజ్’ కి ఆ మధ్య ఇఛ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాలన్నీ చెప్పారు. ఈ బుక్ కోసం ఆయన 18 ఇంటర్వ్యూలు ఇవ్వడం విశేషం.