అమెరికాలోని అరిజోనా స్టేట్‌ను(Arizona wildfire) కార్చిచ్చు వణికిస్తోంది. పెద్దఎత్తున ఇళ్లు డజన్లసంఖ్యలో తగలబడ్డాయి. ఈదురుగాలులు వీయడంతో దావానలం వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో ప్రాణభయంతో వేలాది జనం ఈ ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తమ పెంపుడు జంతువులను కూడా తరలిస్తున్నారు. ఆరిజోనాలోని నార్త్ ఫ్లాగ్‌స్టాప్ పట్టణానికి 14 మైళ్ల దూరంలోని దాదాపు 20 వేల ఎకరాల అడవులను దహించేసింది ఈ కార్చిచ్చు.. ఎగిసిపడుతున్న మంటలు జనావాసాలకు కూడా వ్యాపించాయి,, దాదాపు 25 ఇళ్లు, భవనాలను మంటలు దహించేశాయి.. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంద పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు.. ఈదురు గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.
అమెరికాలో ప్రతిఏటా ఈ సీజన్‌లో అరిజోనా, న్యూ మెక్సికో, కొలరాడో రాష్ట్రాల్లో విస్తరించిన సతత హరితారణ్యాలు ఎండిపోతాయి.. ఈ అడవులు కొద్దిపాటి మంటలకే అంటుకొని వేలాది ఎకరాలకు వ్యాపిస్తుంటుంది.. తాజాగా ఆరిజోనాలో కరువు పరిస్థితులు కార్చిచ్చుకు కారణమయ్యాయంటున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి: AP: ఫీజు కట్టాలంటూ అందరి ముందు అవమానించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు..