అమెరికా : హ్యూస్టన్‌లో “స్నేహ హస్తం” ఎన్జీవో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న వాలంటీర్లు అవార్డులు అందుకోగా.. స్టేజ్ కార్యక్రమాలలో పిల్లల సందడి కనిపించింది. అమెరికాలో ఒంటరిగా ఉంటున్న తెలుగు వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మేం ఉన్నామంటూ భరోసా ఇస్తున్నట్లు స్నేహ హస్తం వ్యవస్థాపకులు దేవిశ్రీ అన్నారు.