Breaking: అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌కు రంగం సిద్దం..

|

Jul 07, 2020 | 11:22 AM

చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా ఇతర సోషల్ మీడియా అప్లికేషన్లను బ్యాన్ చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో సోమవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.”ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందే చెప్పడం ఇష్టం లేకపోయినా.. చైనీస్ యాప్స్‌ను నిషేధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేస్తున్నాను’ అని పాంపియో పేర్కొన్నారు. టిక్ టాక్ యాప్ సేకరించే […]

Breaking: అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌కు రంగం సిద్దం..
Follow us on

చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా ఇతర సోషల్ మీడియా అప్లికేషన్లను బ్యాన్ చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో సోమవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.”ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందే చెప్పడం ఇష్టం లేకపోయినా.. చైనీస్ యాప్స్‌ను నిషేధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేస్తున్నాను’ అని పాంపియో పేర్కొన్నారు.

టిక్ టాక్ యాప్ సేకరించే యూజర్ల డేటాపై యూఎస్ చట్టసభ్యులు అనుమానాలు లేవనెత్తడమే కాకుండా.. జాతీయ భద్రతకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి దేశీయ కంపెనీలు.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఉంటూ.. అక్కడి కంపెనీలు చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని వారు అన్నారు. భారత ప్రభుత్వం చైనా యాప్స్‌పై విధించిన నిషేదాన్ని పాంపియో సమర్ధించారు.