Engine Failure: అమెరికాలో గాల్లోనే విమాన ఇంజన్ ఫెయిల్యూర్, నగరంలో పడిన శిథిలాలు, ప్రయాణికులు క్షేమం

అమెరికాలో డెన్వర్ నుంచి హోనోలూలుకు వెళ్తున్న విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానం ఎగురుతుండగా గాల్లోనే హఠాత్తుగా దీని ఇంజన్..

Engine Failure: అమెరికాలో గాల్లోనే విమాన ఇంజన్ ఫెయిల్యూర్, నగరంలో పడిన శిథిలాలు, ప్రయాణికులు క్షేమం

Edited By:

Updated on: Feb 21, 2021 | 11:28 AM

అమెరికాలో డెన్వర్ నుంచి హోనోలూలుకు వెళ్తున్న విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానం ఎగురుతుండగా గాల్లోనే హఠాత్తుగా దీని ఇంజన్ మండిపోతూ ఫెయిలయింది. ఆ సందర్భంగా ఈ ప్లేన్ నుంచి కొన్ని భాగాలు డెన్వర్ శివార్లలోని బ్రూమ్ ఫీల్డ్ ..లో కింద పడిపోయాయి. ఓ భారీ  శిథిలం ఒకరి ఇంటిపై పడడంతో అక్కడ రంధ్రం ఏర్పడింది. అయితే విమానంలోని 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ఎవరూ గాయపడలేదు. పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి డెన్వర్ కి తీసుకువఛ్చి అత్యవసర మరమ్మతులు చేయించాడు. తామిక మరణించినట్టే భావించామని,  భయంతో తన భార్య చేతులను తాను గట్టిగా పట్టుకున్నానని డేవిడ్ అనే ప్రయాణికుడు తెలిపాడు. కాగా విమానం నుంచి కింద పడిన శిథిలాలను ఎవరూ ముట్టుకోరాదని, దూరంగా ఉండాలని యూఎస్ ఎయిర్ లైన్స్ అధికారులు హెచ్చరించారు.

 

Read More:

ఆమె నుదిటి బొట్టు టాక్ ఆఫ్ ద వరల్డ్, భారత సంతతి నాసా సైంటిస్ట్ స్వాతి మోహన్ చూపు.. శైలి అన్నీ సూపర్ అట్రాక్షన్

కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు, నేరం ‘ఆయనదే’, బెంగాల్ బీజేపీ యువ మోర్చా నేత పమేలా గోస్వామి