Viral News: గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్.. అందరి దృష్టిని ఆకర్షించడానికే అంటూ తల్లిదండ్రులు ఫైర్..

ధరించే దుస్తులు అమ్మాయి వ్యక్తిత్వం నిర్ణయిస్తుందనే విషయం తప్పు. అంతేకాదు జీన్స్ ధరించిన అమ్మాయి సంస్కారం లేదనే అభిప్రాయం మనదేశంలో మాత్రమే ఉందనుకుంటే తప్పు..

Viral News: గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్.. అందరి దృష్టిని ఆకర్షించడానికే అంటూ తల్లిదండ్రులు ఫైర్..
Viral News
Follow us

|

Updated on: Aug 27, 2022 | 9:29 PM

Viral News: అమ్మాయిలు దిరించే దుస్తులను బట్టి వాటి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తన తీరుని అంచనా వేయడం మీరు తరచుగా చూసే ఉంటారు. అయితే ధరించే దుస్తులు  జీన్స్ కల్చర్ , చీరలు కల్చర్డ్ అని కాదు. నువ్వు చీర కట్టినా, జీన్స్ కట్టినా ధరించే దుస్తులు  మీ వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని నిర్ణయించదు. ధరించే దుస్తులు అమ్మాయి వ్యక్తిత్వం నిర్ణయిస్తుందనే విషయం తప్పు. అంతేకాదు జీన్స్ ధరించిన అమ్మాయి సంస్కారం లేదనే అభిప్రాయం మనదేశంలో మాత్రమే ఉందనుకుంటే తప్పు..

ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా గురించి చెప్పాలంటే, మహిళలను వారి దుస్తులను బట్టి అంచనా వేసే చాలా మంది మీకు కనిపిస్తారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి అలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ టీచర్ దుస్తులపై తల్లిదండ్రులు నానా హంగామా సృష్టించడంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

వాస్తవానికి, న్యూజెర్సీలోని ఒక పాఠశాలలో బోధిస్తున్న మహిళలు ధరించే దుస్తులపై తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, మహిళా టీచర్ పదిమంది దృష్టిని ఆకర్షించడానికి ఆమె ధరించిన దుస్తులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా టీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్కూల్ ఫోటోలు పోస్ట్ చేయడం ‘చీప్ పాపులారిటీ’ కోసం చేస్తున్న స్టంట్ అని కూడా ప్రజలు కామెంట్ చేస్తున్నారు.

తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మహిళా ఉపాధ్యాయురాలు: ఇంగ్లీష్ వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన వార్త ప్రకారం, మహిళా టీచర్‌కు టాయ్‌బాక్స్ డాల్జ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఉంది. అక్కడ ఆమె తన పాఠశాల ఫోటోలను షేర్ చేస్తుంది. టీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. ఆమె పోస్ట్‌లను వేలాది మంది ఇష్టపడుతున్నారు.

ఉపాధ్యాయుడు క్లబ్ లేదా పార్టీలో అలాంటి దుస్తులను ధరించాలి .. పాఠశాలలో కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తల్లిదండ్రుల ఆరోపణలపై మహిళా టీచర్ కూడా ఘాటుగా స్పందిస్తూ.. విద్యార్థులకు బోధించడానికే క్లాస్‌కి వస్తానని, నేను మంచి టీచర్‌ని.. నేను ఏ దుస్తులు వేసుకుంటానో  అది నా వ్యక్తిగత నిర్ణయమని చెప్పింది. నేను పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తానని మంచి ఉపాధ్యాయురాలిని నాకు తెలుసు. ద్వేషించేవాళ్లు ద్వేషిస్తూనే ఉంటారని కామెంట్ చేశారు. మహిళా టీచర్ వీడియోపై చాలా మంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..