ఇరాన్ మిలిటరీ కమాండర్ సులేమాన్ మృతికి ముందు.. ట్రంప్ శ్వేతసౌధంలో…

ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమాన్ మీద తమ దేశ డ్రోన్ దాడికి సంబంధించిన దృశ్యాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తదేకంగా.. మినట్ బై మినట్ లైవ్ లో వీక్షించారట.. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఈ నెల 3 న సులేమాన్ యుఎస్ డ్రోన్ దాడిలో హతమైన సంగతి తెలిసిందే. కాగా.. ట్రంప్ తన వైట్ హౌస్ లోని సిచువేషన్ రూంలో కూర్చుని ఈ సీన్స్ ని చూశారట.. సులేమాన్ పై దాడికి ముందు […]

ఇరాన్ మిలిటరీ కమాండర్ సులేమాన్ మృతికి ముందు.. ట్రంప్ శ్వేతసౌధంలో...
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 19, 2020 | 5:52 PM

ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమాన్ మీద తమ దేశ డ్రోన్ దాడికి సంబంధించిన దృశ్యాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తదేకంగా.. మినట్ బై మినట్ లైవ్ లో వీక్షించారట.. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఈ నెల 3 న సులేమాన్ యుఎస్ డ్రోన్ దాడిలో హతమైన సంగతి తెలిసిందే. కాగా.. ట్రంప్ తన వైట్ హౌస్ లోని సిచువేషన్ రూంలో కూర్చుని ఈ సీన్స్ ని చూశారట.. సులేమాన్ పై దాడికి ముందు తమ దేశ సైనికాధికారులకు, ట్రంప్ కు మధ్య నడిచిన సంభాషణ ఇలా ఉంది.

సైనికాధికారులు : ‘ సర్ ! వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు.. వారికి రెండు నిముషాల 11 సెకండ్ల వ్యవధి ఉంది. ఈ కొద్దికాలం మాత్రమే వారు బతికి ఉంటారు. వారు సైనిక వాహనంలో ఉన్నారు. సర్ ! ఇక వారికి కేవలం దాదాపు ఒక నిముషం మాత్రమే వ్యవధి ఉంది. .30 సెకండ్లు… 10….9….8..

ట్రంప్ : ‘ ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందా ?’

సైనికాధికారులు :’ వాళ్ళు ‘ వెళ్లిపోయారు సర్ ! కటింగ్ ఆఫ్ !’

ట్రంప్ : ‘ ఆ మనిషి ఏమయ్యాడు ?’ అతని చివరి మాటలు నాకు వినిపించాయి ‘ 

ఇది డ్రోన్ దాడిపై ట్రంప్ చేసిన డీటైల్డ్ అకౌంట్.. అయితే కొందరు అమెరికన్ ఎంపీలే ట్రంప్ వైఖరిని తప్పు పట్టారు. ఆయన గానీ, ఆయన సలహాదారులు గానీ సులేమాన్.. అమెరికన్లకు ప్రధాన శత్రువన్న వాదనను బహిరంగంగా ఎందుకు ప్రకటించలేకపోయారని వారు విమర్శించారు. అయితే సులేమాన్ మన దేశం గురించి చెడుగా మాట్లాడుతున్నాడని డ్రోన్ దాడికి ముందు ట్రంప్ వ్యాఖ్యానించాడట.. అంటే దాని అర్థం.. సులేమాన్ ని అంతం చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆఖరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్ళీ పోటీ చేయడానికి రిపబ్లికన్ ఫండ్ రైజింగ్ పేరిట 10 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించే లక్ష్యంతో  ఫ్లోరిడాలో జరిగిన ఈవెంట్ లో ట్రంప్ పాల్గొన్నారు. (రిపబ్లికన్ నేషనల్ కమిటీకి ఈ  నిధులు అవసరమట).. కానీ ఈ కార్యక్రమానికి  జర్నలిస్టులను అనుమతించలేదు.