అమెరికాలో ఆ డ్యాం వద్ద ఏం జరిగింది ? ఆయన ఆచూకీ ఎక్కడ ?

| Edited By: Srinu

Jun 18, 2019 | 5:32 PM

అమెరికాలో ఆయనో పెద్ద శాస్త్రవేత్త.. బయో మెడికల్ సైన్సెస్ ఇండస్ట్రీ లో చాలాకాలంగా పని చేస్తున్న విజయ్ కుమార్ అందరికీ ఆప్తుడే.. కావలసినవారే..అయితే ఈ నెల 10 న కాలిఫోర్నియా లోని శాక్రిమెంటో నింబస్ డ్యాం వద్దకు వెళ్లిన ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో అప్పటినుంచీ ఆయన కుటుంబ సభ్యులతో బాటు పోలీసులు, ఇండియన్ అసోసియేషన్ సభ్యులు గాలిస్తున్నారు. పాతికేళ్లుగా అమెరికాలో స్థిర పడిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ అనూహ్య పరిణామాన్ని తట్టుకోలేకపోతున్నారు. […]

అమెరికాలో ఆ డ్యాం వద్ద ఏం జరిగింది ? ఆయన ఆచూకీ ఎక్కడ ?
Follow us on

అమెరికాలో ఆయనో పెద్ద శాస్త్రవేత్త.. బయో మెడికల్ సైన్సెస్ ఇండస్ట్రీ లో చాలాకాలంగా పని చేస్తున్న విజయ్ కుమార్ అందరికీ ఆప్తుడే.. కావలసినవారే..అయితే ఈ నెల 10 న కాలిఫోర్నియా లోని శాక్రిమెంటో నింబస్ డ్యాం వద్దకు వెళ్లిన ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో అప్పటినుంచీ ఆయన కుటుంబ సభ్యులతో బాటు పోలీసులు, ఇండియన్ అసోసియేషన్ సభ్యులు గాలిస్తున్నారు. పాతికేళ్లుగా అమెరికాలో స్థిర పడిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ అనూహ్య పరిణామాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల పోలీసులు ఆయనకు సంబంధించిన పర్సు, మరికొన్ని వస్తువులను ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో వారి ఆందోళన మరింత అధికమైంది. విజయ్ కుమార్ కు భార్య మాధుర్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన తండ్రి ఎంతో బాధ్యతతో ఉండేవారని, ఆయన జాడ తెలియజేయాలని ఆయన కుమారుడు జై కోరుతున్నారు. విజయ్ కుమార్ చాలా హార్డ్ వర్కర్.. క్రమశిక్షణ గల వ్యక్తి.. దయచేసి ఆయన ఆచూకీ తెలియజేయండి అని ఆయన భార్య మాధుర్ దీనంగా అభ్యర్థిస్తున్నారు. అలాగే ఆయన సన్నిహితులు, ఎన్నారైలు కూడా విజయ్ కుమార్ జాడ తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు ఆ రోజున ఆ నింబస్ డ్యాం వద్దకు ఆయన ఎందుకు వెళ్లారు ? ఆయన అక్కడినుంచి మరెక్కడికైనా వెళ్ళారా ? కుటుంబ లేదా ఆర్ధిక సమస్యలంటూ ఏమీ లేని విజయ్ కుమార్ అదృశ్యం పెద్ద మిస్టరీగా మారింది. ఆయన తోటి ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.