New York Health Emergency: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు.. అయితే ఇప్పుడు కొత్త వేరియంట్ కొత్త వేరియంట్ బి.1.1.529 హడలెత్తిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఓ వైపు కరోనా కేసులు భారీగా నమోదుతున్నాయి. ఇదే సమయంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగులోకి రావడంతో ముందు జాగ్రత్తగా న్యూయార్క్ రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇదే విషయాన్నీ న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో శుక్రవారం పేర్కొన్నారు.
అయితే ఇప్పటి వరకూ తమ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవు కాలేదని చెప్పారు. అయినప్పటికినీ పలు దేశాల్లో ఈ వేరియంట్ తీవ్రతని దృష్టిలో పెట్టుకుని తాము ముందు జాగ్రత్తగా అత్యవసర పరిస్థితిని ప్రకటించమని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది శీతాకాలం.. ఓ వైపు సీజనల్ వ్యాధులు.. మరోవైపు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు కోవిడ్ చికిత్సలకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకుంటున్నామని చెప్పారు. న్యూయార్క్‌లో శుక్రవారం 6,295 COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 28 కొత్త మరణాలు సంభవించాయి, అయితే కొత్త ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని.. వైరస్ నమూనాలను నిశితంగా పరీక్షిస్తున్నామని చెప్పారు. ఓమిక్రాన్ వేరియంట్ నియంత్రణ విషయంలో WHOతో కలిసి పని చేస్తూనే ఉంటాము” అని న్యూ యార్క్ గవర్నర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ బి.1.1.529 ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ కొత్త వేరియంట్ B.1.1.529కు ‘ఒమిక్రాన్’గా నామకరణం చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాదు ఒమిక్రాన్‌ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
Also Read: ఏపీలో అక్కడ ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర.. కిలో రూ.10 నుంచి రూ.27 మాత్రమే..