ఒక పక్క ఒళ్లు జలదరించే గాలివాన.. మరో పక్క చెవులు చిల్లులు పెట్టే ఫైరింజన్ల సైరన్ మోత.. మరోపక్క చెరువులవుతున్న రోడ్లు.. వాటిపై పడవల్లా తేలియాడుతున్న కార్లు.. సునామీ పోటెత్తుతున్నట్టు మెట్రో స్టేషన్లు.. ఇళ్లలోకి, సెల్లార్లలోకి వరద నీళ్లు.. జనజీవనం జలదిగ్బంధం.. నీటిపై తేలియాడుతున్న నగరం ఇవన్నీ ఎక్కడో కాదు అగ్రదేశం అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు న్యూయార్క్, న్యూజెర్సీ గవర్నర్లు. అమెరికాను ఐడా తుఫాను వణికిస్తోంది. ఐడా తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. న్యూయార్క్, న్యూజెర్సీలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది నిరాశ్రయులయ్యారు. న్యూజెర్సీ ఎయిర్‌పోర్ట్.. నీట మునిగింది.
చిగురుటాకులా అమెరికా..
భారీ వర్షాలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ దాని పక్కనే ఉన్న న్యూజెర్సీ రాష్ట్రాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో న్యూయార్క్, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దక్షణాది రాష్ట్రం లూసియానాను ఐడా తుఫాను ముంచెత్తగ్గా.. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వరదలు, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
ప్రపంచ ఆర్ధిక రాజధాని..
తుఫానుతో ప్రపంచ ఆర్ధిక..సాంస్కృతిక రాజధాని న్యూయార్క్‌లో భారీ వరదలు ముంచెత్తడంతో ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్రూక్లిన్, క్వీన్స్ నగరాలను వరదలు ముంచెత్తాయి. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఇక రోడ్ల సంగతి చెప్పనక్కర్లేదు. రోడ్లు చెరువులు అవుతుంటే… కార్లు పడవల్లా మారిపోతున్నాయి. బిల్డింగ్ సెల్లార్లలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎటు చూసినా నీళ్లే నీళ్లు కనిపిస్తున్నాయి. న్యూయార్క్ నగరాన్ని వరదలు ముంచెత్తుతుండటంతో.. ఇళ్లు వాకిళ్లు.. జలమయం కావడంతో అక్కడి గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.
న్యూజెర్సీలోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇల్లయినా ఒకటే- రోడ్డయినా ఒకటే- మెట్రో స్టేషన్ అయినా ఒకటే- అన్నట్టుగా ఉంది ఇక్కడి పరిస్థితి.
Flooding baggage area at newark airport pic.twitter.com/LxjDJHpXAH
— Bill Ritter (@billritter7) September 2, 2021
Our infrastructure is not ready for climate change, a thread from tonight. 28th St. subway station pic.twitter.com/uYemJKB8yg
— Brian Kahn (@blkahn) September 2, 2021