తల్లీకూతుళ్లు చరిత్ర సృష్టించారు. పైలట్, కోపైలట్లుగా ఒకే విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన అమెరికా (America) లో జరిగింది. హోలీ పెటిట్‌కు విమానంలో పైలట్‌గా రాణించాలన్నది కోరిక. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో 18 ఏళ్లుగా పని చేస్తున్నారామె. మరోవైపు హోలి కుమార్తె కీలి పెటిట్ కూడా చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనుకుంది. 2017లో ఆమె పైలట్ లైసెన్స్ పొందింది. అనంతరం తల్లి పని చేస్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ట్రైనీగా చేరింది. 2018 నుంచి పూర్తి స్థాయి పైలట్‌గా ఆ సంస్థలో విధులు నిర్వహిస్తోంది. కాగా, తల్లీకూతుళ్లు జూలై 23న చరిత్ర సృష్టించారు. పైలట్లైన ఇద్దరూ కలిసి డెన్వర్ నుంచి సెయింట్ లూయిస్‌కు ప్రయాణికుల విమానాన్ని నడిపారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి హోలి కెప్టెన్‌గా ఉండగా ఆమె కుమార్తె కీలి కో పైలట్‌గా ఉండటం విశేషం.
‘ఇక్కడ ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇది మా ఇద్దరికీ, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చాలా ప్రత్యేకమైన రోజు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ డెక్‌లో తొలి తల్లీకూతుళ్లం’ అని తమ సంతోషాన్ని తోటి ప్రయాణికులతో పంచుకున్నారు. కాగా తల్లీకూతుళ్ల విమానయానానికి సంబంధించిన వీడియోను సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది . దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తల్లీ, కుమార్తె అయిన హోలి, కీలి పైలట్లుగా రాణించడంతోపాటు, ఇద్దరూ కలిసి ఒకే విమానాన్ని నడిపి రికార్డు సృష్టించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
This mother-daughter duo made history as co-pilots on the flight deck of Southwest Airlines ? pic.twitter.com/KeXCYsY5wU
— NowThis (@nowthisnews) August 3, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..