డోనాల్డ్ ట్రంప్ కు పార్సిల్ లో విషం ! వైట్ హౌస్ లో కలకలం !

| Edited By: Anil kumar poka

Sep 20, 2020 | 10:53 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తరుణం దగ్గర పడుతున్న వేళ..ట్రంప్  నివాస భవనం వైట్ హౌస్ 'దరిదాపులకు' భయంకర విషంతో కూడిన ఓ పార్సిల్ చేరింది. 'రిసిన్' అనే పేరిట వ్యవహరిస్తున్న విషంతో కూడిన ఈ పార్సిల్ కెనడా నుంచి వచ్చినట్టు

డోనాల్డ్ ట్రంప్ కు పార్సిల్ లో విషం ! వైట్ హౌస్ లో కలకలం !
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తరుణం దగ్గర పడుతున్న వేళ..ట్రంప్  నివాస భవనం వైట్ హౌస్ ‘దరిదాపులకు’ భయంకర విషంతో కూడిన ఓ పార్సిల్ చేరింది. ‘రిసిన్’ అనే పేరిట వ్యవహరిస్తున్న విషంతో కూడిన ఈ పార్సిల్ కెనడా నుంచి వచ్చినట్టు భావిస్తున్నామని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగం తెలిపింది.  అనుమానాస్పదంగా ఉన్న ఈ కవర్ వైట్ హౌస్ కి చేరక ముందే ప్రభుత్వ మెయిల్ సెంటర్ లో అధికారులు దీన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ప్రస్తుతానికి దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని వారు చెప్పారు. వైట్ హౌస్ గానీ, యుఎస్ సీక్రెట్ సర్వీసు గానీ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ పార్సిల్ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.

రిసిన్ అనే ఈ డెడ్లీ పాయిజన్ ని బయాలజికల్ వెపన్ గా కూడా వాడుతారట. ఇది ఎక్స్ పోజర్ కి గురి కాగానే 36 గంటల నుంచి 72 గంటల్లోగా మరణం సంభవిస్తుందని అంటున్నారు. లోగడ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వేర్వేరు సందర్భాల్లో ఇలాంటి విషంతో కూడిన రెండు లెటర్స్ అందగా ఇద్దరిని అరెస్టు చేశారు. 2014 జులైలో ఒబామాతో బాటు న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్ బెర్గ్ కి టెక్సాస్ కి చెందిన నటుడొకరు ఈ విధమైన పార్సిల్ పంపగా అతనికి  18 ఏళ్ళ జైలుశిక్ష విధించారు.