Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌ షాక్‌.. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేల్చిన జ్యూరీ..

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ పత్రిక కాలమిస్ట్ ఇ జీన్ కారోల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి, పరువు తీశారని అమెరికా జ్యూరీ మంగళవారం (మే 9) ఆరోపించింది.

Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: May 11, 2023 | 5:22 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. ప్రముఖ రచయిత్రిని ఆయన లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది..దీంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది.1996లో మాన్‍హటన్ అవెన్యూలోని లగ్జరీ బర్జ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని రచయిత్రి ఇ. జీన్‌ కారెల్‌ ఆరోపించారు. 2019లో ఓసారి తన గురించి అసభ్యంగా మాట్లాడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.ఈ ఆరోపణలపై విచారణ జరిపిన జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది.అయితే ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని..కానీ జీన్ కారోల్ చేసిన ఇతర ఆరోపణలు నిజమేనని తేలడంతో ఆమెకు పరిహారంగా 41 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

అయితే ఈ ఆరోపణలను ట్రంప్ పూర్తిగా తోసిపుచ్చారు. తీర్పుపై విమర్శలు గుప్పించారు. ఈ తీర్పు అవమానకరంగా ఉందని మండిపడ్డారు..లైంగిక ఆరోపణలు చేసిన రచయిత్రి అసలు ఎవరో కూడా తనకు తెలియదంటూ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతా వేదికగా తెలిపారు.

కారోల్‌పై అత్యాచారం ఆరోపణలు

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న 76 ఏళ్ల ట్రంప్‌పై 79 ఏళ్ల కారోల్ గతేడాది దావా వేశారు. 1996లో మాన్‌హట్టన్‌లోని ఫిఫ్త్ అవెన్యూలోని లగ్జరీ బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్ దుస్తులు మార్చుకునే గదిలో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని కారోల్ ఆరోపించారు. మాజీ ఎల్లే మ్యాగజైన్ కాలమిస్ట్ కూడా 2019లో ఆమె ఆరోపణలను బహిరంగపరిచినప్పుడు, ట్రంప్ తన పరువు తీసిన “పూర్తి బూటకానికి” పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ కేసును ‘మోసం’..

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన ఫెడరల్ జ్యూరీ కారోల్‌ను పరువు తీసినందుకు ట్రంప్‌ను బాధ్యులను చేసింది. అక్టోబర్‌లో, ట్రంప్ తన వెబ్‌సైట్ ట్రూత్ సోషల్‌లో కారోల్ కేసును పూర్తి మోసం, మోసం, అబద్ధం అని పేర్కొంటూ ఒక ప్రకటనను పోస్ట్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం