Indian Techie: అమెరికాలో విషాదం.. భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. అనాథగా మారిన నాలుగేళ్ల చిన్నారి

|

Apr 09, 2021 | 2:26 PM

Indian Techie: అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో భారతీయ దంపతులు అనుమానస్పద స్థతిలో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన బాలాజీ భరత్‌ రుద్రావర్‌ ...

Indian Techie: అమెరికాలో విషాదం.. భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. అనాథగా మారిన నాలుగేళ్ల చిన్నారి
Indian Techie
Follow us on

Indian Techie: అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో భారతీయ దంపతులు అనుమానస్పద స్థతిలో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన బాలాజీ భరత్‌ రుద్రావర్‌ (32), భార్య ఆర్తి బాలాజీ (30) న్యూజెర్సీలోని నార్త్‌ ఆర్లింగ్లన్‌లో వారి నివాసంలో బుధవారం విగతజీవులుగా కనిపించారు. ఆ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది. ఈ చిన్నారి ఏడుస్తూ బాల్కానీలోకి రావడంతో ఏడుస్తూ కనిపించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు .. బాలాజీ ఇంటి తలుపులు తీసేందుకు పోలీసులు ప్రయత్నించగా, లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గమనించారు. దాంతో ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, దంపతులు రక్తపు మడుగులో పడి ఉండటం గమనించారు.

వారి ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ ఇది హత్యనా…? ఆత్మహత్యనా..? అనే విషయంపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు. అయితే వారి శరీరాలపై కత్తిపోట్లు ఉండగం, లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

కాగా, మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాకు చెందిన బాలాజీ దంపతులు 2015 ఆగస్టులో అమెరికా వలస వెళ్లారు. బాలాజీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆర్తి ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. ఇక బాలాజీ, ఆర్తి మృతితో వారి స్వస్థంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి మృతదేహాలు స్వదేశానికి రావడానికి 8 రోజుల నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నారి న్యూజెర్సీలోని వారి స్నేహితుల వద్ద ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి: నైన్త్ క్లాస్ అబ్బాయి.. మెడిసిన్ అమ్మాయి.. కట్‌ చేస్తే పోలీస్ స్టేషన్‌లో విద్యార్థి.. ఏం జరిగిందో తెలుసా..?

Lady Khiladi: మాయమాటలతో వలలో వేసుకుని డబ్బులు గుంజుతున్న ఖిలాడి లేడీ.. లబోదిబోమంటున్న బాధితులు..