కీలక ఐక్యరాజ్యసమితి కమిటీకి భారత దౌత్యవేత్త ఎన్నిక

|

Nov 07, 2020 | 7:43 PM

ఐక్య రాజ్య సమితిలో అత్యంత కీలకమైన సలహా కమిటీకి భారతీయ దౌత్యవేత్త విదిశ మైత్ర ఎన్నికయ్యారు. ఇరాక్ అభ్యర్థిపై విదిశ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.

కీలక ఐక్యరాజ్యసమితి కమిటీకి భారత దౌత్యవేత్త ఎన్నిక
Follow us on

ఐక్య రాజ్య సమితిలో అత్యంత కీలకమైన సలహా కమిటీకి భారతీయ దౌత్యవేత్త విదిశ మైత్ర ఎన్నికయ్యారు. ఇరాక్ అభ్యర్థిపై విదిశ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలోని 193 దేశాలు ఈ ఎన్నికలో పాల్గొనగా, 126 ఓట్లతో మైత్ర విజయం సాధించారు. ఈ బృందంలో ఇరాక్‌కు చెందిన అలీ మహ్మద్ ఫాయక్ అల్-దబాగ్ 64 ఓట్లు సాధించారు. ఆసియా పసిఫిక్ గ్రూప్‌లో ఈ కమిటీకి ఎన్నికయ్యేందుకు ఉన్న ఏకైక పదవి భారత దేశ దౌత్యవేత్తకు దక్కడం విశేషం.

ఐరాస జనరల్ అసెంబ్లీ అనుబంధ సంస్థ అయిన అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెట్ ప్రశ్నలపై ఐరాస సలహా కమిటీలో ఆమెకు స్థానం దక్కింది. విస్తృత భౌగోళిక ప్రాతినిధ్యం, వ్యక్తిగత అర్హతలు, అనుభవం ఆధారంగా ఈ కమిటీలో సభ్యులను ఎంపిక చేస్తారు. ఆసియా-పసిఫిక్ దేశాల బృందం నుండి నామినేట్ అయిన ఇద్దరు అభ్యర్థులలో ఎంఎస్ మైత్రా ఒకరు. 1946లో ఈ కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఈ కమిటీలో సభ్యత్వం భారత దేశానికి తొలిసారి లభిస్తోంది. ప్రస్తుతం విదిశ న్యూయార్క్‌లోని ఐరాసకు భారత దేశ పర్మినెంట్ మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పరిపాలనా, బడ్జెట్ అంశాలపై వ్యవహరించే సర్వసభ్య ఐదవ కమిటీ ఎంఎస్ మైత్రాను అసెంబ్లీకి సిఫారసు చేసింది. పరిపాలన, బడ్జెట్ సంబంధిత అంశాలపై సాధారణ సభకు సలహాలు ఇస్తుంది. 2021 జనవరి 1 నుంచి మూడేళ్ల పాటు సలహా కమిటీ సభ్యురాలిగా ఆమె కొనసాగనున్నారు. 2021 జనవరి నుంచి రెండేళ్ల కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఉండనున్న తరుణంలో ఐరాస సలహా కమిటీకి విదిషా మైత్రా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

1946లో ఈ కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఈ కమిటీలో సభ్యత్వం భారత దేశానికి లభిస్తోంది. ఐరాసలో ఈ పదవికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఐరాస సెక్రటరీ జనరల్ సాధారణ సభలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఈ కమిటీ పరిశీలిస్తుంది. పరిపాలన, బడ్జెట్ సంబంధిత అంశాలపై సాధారణ సభకు సలహాలు ఇస్తుంది. ప్రస్తుతం విదిశ న్యూయార్క్‌లోని ఐరాసకు భారత దేశ పర్మినెంట్ మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.