Indian American Women: బైడెన్ ప్రభుత్వంలో ఇద్దరు భారత సంతతి మహిళలు.. కీలక పదవుల్లో నియామకం..
Indian American Women: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఇద్దరు భారత సంతతికి చెందిన మహిళలకు కీలక పదవులు లభించాయి. సోహినీ
Indian American Women: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఇద్దరు భారత సంతతికి చెందిన మహిళలకు కీలక పదవులు లభించాయి. సోహినీ ఛటర్జీ, అదితి గోరూర్‌లు అమెరికా తరపున ఐక్యరాజ్యసమితిలో పనిచేయనున్నారు. వీరిద్దరు కూడా ఉన్నత విద్యావంతులు. గతంలో పలుచోట్ల పనిచేసిన అనుభవం గల మహిళలు. సోహినీ ఛటర్జీ ఐరాసలో అమెరికా రాయబారికి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు.
ఈమె ఇటీవల కాలం వరకు కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అంతకు ముందు అమెరికా ప్రభుత్వ సంస్థ – ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో కూడా పనిచేశారు. బైడెన్ ప్రభుత్వంలో అమెరికా, భారత సంబంధాలు మరింతగా బలపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అదితి గోరూర్ ఇదివరకు మనదేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యుమన్ సెటిల్‌మెంట్స్‌లో విధులు నిర్వహించారు. ఈమె అమెరికాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, జార్జిటౌన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. ఐరాస శాంతి పరిరక్షక అంశాల్లో అదితి నిపుణురాలు. అదితి ప్రస్తుతం స్టిమ్సన్ సెంటర్‌లో ప్రొటెక్టింగ్ సివిలియన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ప్రోగ్రాం డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.