భారత పౌరసత్వ చట్టం పట్ల అమెరికా ప్రశంసలు కురిపించింది. పౌరసత్వం, మత స్వేఛ్చ వంటి అంశాలపై ఆ దేశంలో విస్తృత చర్చ జరిగిందని, భారత ప్రజాస్వామ్యాన్ని తాము గౌరవిస్తున్నామని పేర్కొంది. ప్రపంచంలో మైనారిటీలు, మతపరమైన హక్కుల పరిరక్షణ పట్ల తాము సదా యోచిస్తుంటామని, ముఖ్యంగా పౌరసత్వంపై కీలకమైన చర్చను మీరు లేవనెత్తారని అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో అన్నారు. వాషింగ్టన్ లో ఆయన తమ దేశ రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. 2 +2 పేరిట జరిగిన ఈ సమావేశంలో భారత విదేశాంగ, రక్షణ మంత్రులు ఎస్.జయశంకర్, రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
సవరించిన పౌరసత్వ చట్టంపై ఇండియాలో వెల్లువెత్తిన నిరసనలను జయశంకర్ దృష్టికి మీడియా తేగా.. ‘ మీరు ఈ అంశంపై జరిగిన డిబేట్ ను కూలంకషంగా పరిశీలించిన పక్షంలో కొన్ని దేశాల్లో వేధింపులను ఎదుర్కొంటున్న మైనారిటీల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించినదే ఈ చట్ట సవరణ అని అర్థమవుతుందని ఆయన అన్నారు. ఆయా దేశాల్లో మైనారిటీలు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి బహుశా అవగాహన చేసుకుంటే ఇలా మాట్లాడరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధమైన అంశాలపై కేవలం ఇండియానే గాక.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యలను తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని పాంపియో పేర్కొన్నారు.
అటు-ఇండియాలో మతపరమైన స్వేఛ్చ, మానవ హక్కులు అన్న విషయాలు ఈ సమావేశంలో వచ్చాయా, లేదా అన్నదాన్ని నిర్ధారించేందుకు అధికారులు తిరస్కరించారు.
At the #USIndia 2+2 Ministerial we explored ways to deepen our shared security, advance a free and open #IndoPacific region, and expand economic prosperity. These efforts, all built on the foundation of a strong strategic partnership, will benefit the people of both our nations. pic.twitter.com/r2tK2iZZKb
— Secretary Pompeo (@SecPompeo) December 18, 2019