అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కుటుంబంలో విషాదం… నాన్నమ్మ సారా ఒబామా కన్నుమూత

|

Mar 29, 2021 | 5:44 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఒబామా వరసకు నాన్నమ్మ సారా ఒబామా సోమవారం కన్నుమూశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కుటుంబంలో విషాదం... నాన్నమ్మ సారా ఒబామా కన్నుమూత
Obama's Step Grandmother Passes Away
Follow us on

Obama’s step-grandmother: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఒబామా వరసకు నాన్నమ్మ సారా ఒబామా సోమవారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమె కెన్యాలో తన 99 ఏట మరణించారు. పశ్చిమ కెన్యా దేశంలోని మూడవ అతిపెద్ద నగరమైన కిసుములోని జరమోగి ఓగింగా ఓడింగా టీచింగ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. నాన్నమ్మ మరణంపై ఒబామా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘ ఇది నిజం.. ఆమె దేవుడి దగ్గరకు వెళ్లింది. ఈ ఉదయం ఆమె చనిపోయింది’’ అని ఆమె కూతురు మర్శత్‌ ఓన్‌యాంగో భావోద్వేగానికి గురయ్యారు. సారా ఒబామా 1922లో లేక్‌ విక్టోరియాలో జన్మించారు. బరాక్‌ ఒబామా తాత గారు హుస్సేన్‌ ఓన్‌యాంగో ఒబామా మూడో భార్య ఈ సారా ఒబామా. సారా ఒబామా ఫౌండేషన్‌ పేరిట ఆమె అనాథ పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు.

రక్త సంబంధం లేకపోయినప్పటికి ఒబామా ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. 2006లో కెన్యా వెళ్లిన ఆయన సారా ఇంటికి వెళ్లారు. ఆమెను తన బామ్మ అంటూ అందరికీ పరిచయం చేశారు. ఒబామా తరచూ ఆమె పట్ల అభిమానం చూపిస్తూ, “డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్” అనే తన జ్ఞాపకంలో ఆమెను “గ్రానీ” గా పేర్కొన్నారు. ఆ తర్వాతే ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది. కాగా, మంగళవారం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

దశాబ్దాలుగా, సారా ఒబామా అనాథలకు సహాయం చేసి, కొంతమందిని తన ఇంటిలో పెంచుకున్నారు. సారా ఒబామా ఫౌండేషన్ ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆహారంతో పాటు విద్యను అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. పాఠశాల సామాగ్రి, యూనిఫాం, ప్రాథమిక వైద్య అవసరాలు మరియు పాఠశాల ఫీజులను కూడా చెల్లించారు.

Read Also…  ముక్కుకు మాస్క్ లేకపోతే.. ఇక జేబు గుల్లే.. భారీ జరిమానాకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర సర్కార్..!