దాదాపు రెండొందల యాభై ఏళ్ల చరిత్ర కలిగిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పటి వరకు జరగనిది జరగబోతోంది. ఒక మాజీ అధ్యక్షుడు నేరారోపణలపై కోర్టు మెట్లెక్కబోతున్నారు. ఆ ఘనతను సొంతం చేసుకోబోతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్‌కు జరిపిన డబ్బు చెల్లింపు వ్యవహారం అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పరువును బజారుకీడ్చింది. 2024 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలనుకున్న ఆయన కలకు తూట్లు పొడుస్తోంది. సుదీర్ఘ అమెరికా చరిత్రలో ఇంత వరకు ఒక అధ్యక్షుడు లేదా మాజీ అధ్యక్షుడిపై నేరాలు మోపిన సంఘటనలు లేవు. కోర్టుకు హాజరైన ట్రంప్‌ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి లొంగిపోయేందుకే ట్రంప్ న్యూయార్క్ మన్‌హట్టన్ సుప్రీంకోర్టుకు వస్తున్నారు. కేసు తీవ్రతను బట్టి అరెస్టు చేయాలా? బెయిల్ ఇవ్వాలా అన్నది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కోర్టుకు వచ్చిన వెంటనే ఆయన ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
2016లో పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లించిన వ్యవహారంలో గత మంగళవారం న్యూయార్క్ కోర్టు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దోషిగా ప్రకటించింది. ఈ కేసులో తన వాదనను వినిపించేందుకు న్యూయార్క్ సుప్రీంకోర్టుకు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. కోర్టుకు హాజరయ్యేందుకు నిన్న రాత్రే ట్రంప్ ప్రత్యేక విమానంలో ఫ్లారిడా నుంచి దాదాపు మూడున్నర గంటల ప్రయాణం చేసి న్యూయార్క్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ట్రంప్ టవర్‌కు వచ్చే దారిలో పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు స్వాగతం పలికారు.
మరో వైపు అమెరికన్ కోర్టుల్లో విచారణను టీవీల్లో లైవ్ ప్రసారం చేస్తూ ఉంటారు. కాని ట్రంప్ విచారణను ప్రసారం చేయొద్దని ఆయన తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జూవన్ మెర్చన్ మన్నించారు. లైవ్ టెలికాస్ట్ న్యూస్ ఛానెల్స్‌ను ఆదేశించారు. అయితే విచారణ ప్రారంభం కావడానికి ముందు కోర్టు గదిని, ట్రంప్ ఫొటోలు తీసేందుకు ఐదుగురు ఫొటోగ్రాఫర్లను అనుమతిస్తారు. ట్రంప్‌పై మోపిన నేర అభియోగాలను ఇవాళ్టి విచారణలో వెల్లడిస్తారు. ట్రంప్‌పై మోపిన నేరాలను ఇంత వరకు ఆయన తరపు న్యాయవాదులు చూడలేదు.
ఏ నేరాలు మోపారో బహిర్గతం కాకున్నప్పటికీ కేసు దృష్ట్యా ఆ అభియోగాలన్నింటినీ ట్రంప్, ఆయన తరపు న్యాయవాదులు ఖండిస్తున్నారు. తానే తప్పు చేయలేదని కోర్టులోనూ ట్రంప్ చెప్తారని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు అభియోగాలన్ని తొలగించేంత వరకు న్యాయపోరాటం చేయాలని ట్రంప్ టీమ్ ఇప్పటికే నిర్ణయించింది. వాస్తవానికి డబ్బు చెల్లింపు, ఆ వివరాలు దాయడమన్నది అన్నది అమెరికన్ చట్టాల ప్రకారం దుష్ప్రవర్తన కిందుకు వస్తుంది. కాని, ఇది ఎన్నికల చట్టానికి న్యాయవాదులు ముడిపెడితే అది నేరంగా పరిగణించడం జరుగుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం