అమెరికాలో కరోనా వైరస్ వ్యాక్సీన్ పై ఒత్తిడేమీ లేదు, ఫోసీ

| Edited By: Anil kumar poka

Aug 20, 2020 | 11:24 AM

తమ దేశంలో ప్రతివారూ కరోనా వైరస్ వ్యాక్సీన్ ని  తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనేదీ లేదని అంటువ్యాధుల నివారణా నిపుణుడు ఆంథోనీ ఫోసీ అన్నారు. ఇలా అని ప్రభుత్వం అందరిమీదా ఒత్తిడి తేజాలదని చెప్పారు.

అమెరికాలో కరోనా వైరస్ వ్యాక్సీన్ పై ఒత్తిడేమీ లేదు, ఫోసీ
Follow us on

తమ దేశంలో ప్రతివారూ కరోనా వైరస్ వ్యాక్సీన్ ని  తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనేదీ లేదని అంటువ్యాధుల నివారణా నిపుణుడు ఆంథోనీ ఫోసీ అన్నారు. ఇలా అని ప్రభుత్వం అందరిమీదా ఒత్తిడి తేజాలదని చెప్పారు. పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కొన్ని వర్గాలకు ఈ నిబంధనలు ఉంటే ఉండవచ్ఛునని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్ లో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడైన ఆయన..జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాక్సీన్ కి  ఆమోదం  లభించిన వెంటనే తమ దేశంలో ప్రతి వ్యక్తీ..తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ నిబంధన విధించారని ఆయన గుర్తు చేశారు.

అయితే అమెరికాలో  అలాంటి  నిర్బంధమేమీ లేదని, అది సముచితం కూడా కాదని ఫోసీ అభిప్రాయపడ్డారు.