H-1B Visa: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ సహా ఇతర నాన్ ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాలపై విధించిన నిషేధం బుధవారం అర్థరాత్రితో (మార్చి31)తో ముగిసింది. ఇక ఈ నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లబ్ది చేకూరనుంది. కాగా, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్, కరోనా సంక్షోభం కారణంగా అమెరికన్లకు భారీగా నష్టం వాటిల్లుతుందని మాజీ అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బీతో పాటు ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసాలపై 2020 జూన్లో నిషేధం విధించారు. అయితే తొలుత 2020 డిసెంబర్ 31వరకు ఈ నిషేధ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించారు. అనంతరం డిసెంబర్ 31న మరోసారి ఈ ఆంక్షలను 2021 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కోవిడ్ ప్రభావంతో దేశ ప్రజలపై ఇంకా కొనసాగుతున్నందున వర్క్ వీసాలపై మళ్లీ నిషేధాన్ని పొడిగించక తప్ప లేదని అప్పుడు ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే, బైడెన్ కొత్త ప్రభుత్వం తాజాగా ఈ ఆంక్షల పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ట్రంప్ విధించిన ఆ గడువు నిన్నటితో ముగిసిపోయింది. ఇక ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు కఠినమైనవని, హెచ్-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేస్తామని బైడెన్ సర్కార్ హామీ ఇచ్చింది. ఇది వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు కలుగనుంది.
అయితే ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధం ముగియడంతో బైడెన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అమెరికన్ సంస్థలకు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు మార్గం సుగమమైంది. అటు అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ నిపుణులకు ఇది శుభవార్తేనని చెప్పాలి.
ఇదిలాఉంటే.. 2022 ఏడాదికి గాను హెచ్-1బీ వీసాలకు సంబంధించి ప్రాథమిక దరఖాస్తుల స్వీకరణ పూర్తైందని, ఏప్రిల్ 1 నుంచి అర్హులైన వారు పిటిషన్ దాఖలు చేసుకోవాలని తాజాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.
ఇవీ చదవండి: Johnson and Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై ఎన్నో సందేహాలు.. నాణ్యతలో విఫలం
America Joe Biden: భారీ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరో కీలక ప్రతిపాదన