ఆర్మేనియాలో స్పీకర్‌ను చితకబాదిన నిరసనకారులు

|

Nov 10, 2020 | 1:48 PM

అహింసో పరమోధర్మః అన్నది ఆర్మేనియా వారికి తెలియనట్టుగా ఉంది.. అది తెలిసుంటే ఆ దేశ స్పీకర్‌పై దాడికి దిగేవాళ్లు కాదు నిరసనకారులు. రష్యా, అజర్‌బైజాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆర్మేనియా ప్రధానమంత్రి

ఆర్మేనియాలో స్పీకర్‌ను చితకబాదిన నిరసనకారులు
Follow us on

అహింసో పరమోధర్మః అన్నది ఆర్మేనియా వారికి తెలియనట్టుగా ఉంది.. అది తెలిసుంటే ఆ దేశ స్పీకర్‌పై దాడికి దిగేవాళ్లు కాదు నిరసనకారులు. రష్యా, అజర్‌బైజాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్‌ పాషిన్యాన్‌ ప్రకటించగానే నిరసనకారులకు ఎక్కడలేని కోపం వచ్చేసింది.. ఆ కోపంతోనే రాజధాని నగరం యెరెవాన్‌లో ఉన్న పార్లమెంట్‌లోకి చొరపడ్డారు.. అక్కడే ఉన్న స్పీకర్‌ ఆరారత్‌ మిర్జోయన్‌ను చితకబాదారు.. ఇప్పుడాయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు నాయకులు, అధికారులతో కలిసి చర్చించిన తర్వాతే శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ప్రధానమంత్రి చెబుతున్నారు. ప్రధానమంత్రి ప్రకటన చేయగానే యెరెవాన్‌ వీధులు తుపాకులతో మారుమోగాయి.. శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు ప్రధాని పాషిన్యాన్‌ కోసం వెతుకుతూ ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డారు. మరోవైపు శాంతి ఒప్పందంపై నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.