మహాత్మా గాంధీని గౌరవించుకున్న న్యూయార్క్‌లోని చిన్ని పట్టణం

మహాత్మాగాంధీ లాంటి మనిషి భూమ్మీద రక్త మాంసాలతో నడిచాడంటే భవిష్యత్తరాలు నమ్మకపోవచ్చన్నాడు ప్రఖ్యాత శాస్ర్తవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌...జీసస్‌ నాకు సందేశం ఇచ్చాడు.. గాంధీ దాన్ని ఆచరణలో చూపాడు ..

  • Balu
  • Publish Date - 1:47 pm, Thu, 8 October 20
మహాత్మా గాంధీని గౌరవించుకున్న న్యూయార్క్‌లోని చిన్ని పట్టణం

మహాత్మాగాంధీ లాంటి మనిషి భూమ్మీద రక్త మాంసాలతో నడిచాడంటే భవిష్యత్తరాలు నమ్మకపోవచ్చన్నాడు ప్రఖ్యాత శాస్ర్తవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌…జీసస్‌ నాకు సందేశం ఇచ్చాడు.. గాంధీ దాన్ని ఆచరణలో చూపాడు .. ఈ మాటన్నది మార్టిన్‌ లూథర్‌ కింగ్‌.. గాంధీ అందరికీ ఆదర్శప్రాయుడే.. అందరికీ మార్గదర్శకుడే.. అందరికీ ఆరాధ్యనాయకుడే! అందుకే ప్రపంచమంతా ఆయనను స్మరించకుంటుంది.. ..వివిధ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఆయనబాటలో పయనించే బలమివ్వమని ప్రార్థిస్తుంటాయి.. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలోని ఓ చిన్నపట్టణం అమ్‌హెర్సెట్‌ కూడా మహాత్ముడిపై తనకున్న భక్తిని చాటుకుంది.. సత్యాగ్రహమే సాధనంగా స్వరాజ్యం తెచ్చిన బాపు… శాంతి, అహింసలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాడు. గాంధీ జయంతి రోజున అమ్‌హెర్సెట్‌ పట్టణ పౌరులంతా కలిసి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం భారతీయులకు గర్వకారణం. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో న్యూయార్క్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ రణ్‌ధీర్‌ జైస్వాల్‌ హాజరయ్యారు. గాంధీ విగ్రహాల రూపశిల్పి రామ్‌సుతార్‌ దీన్నిరూపొందించారు. ఇప్పటికీ అవసరమయ్యే గాంధీ సిద్ధాంతాలకు తమ పట్టణంలో ఓ భౌతిక రూపం కల్పించాలని అనుకున్నామని, అందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని కౌన్సిల్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ ఇండియా డైరక్టర్‌ సిబు నాయర్‌ అన్నారు.