అమెరికా కవయిత్రి లూయిస్‌ గ్లక్‌కు సాహితీ రంగపు నోబెల్‌ పురస్కారం!

| Edited By: Balaraju Goud

Oct 09, 2020 | 1:08 PM

ఆమె అలతి పదాలతో అనంతమైన భావాలను ఆవిష్కరిస్తుంది కాబట్టే కవయిత్రి లూయిస్‌ గ్లక్‌కు సాహిత్యరంగంలో ఈ ఏడాది ప్రతిష్టాకరమైన నోబెల్‌ పురస్కారం లభించింది. ఆ విధంగా నోబెల్‌ పురస్కారం తనను తాను గౌరవించుకుంది.

అమెరికా కవయిత్రి లూయిస్‌ గ్లక్‌కు సాహితీ రంగపు నోబెల్‌ పురస్కారం!
Follow us on

ఆమె అలతి పదాలతో అనంతమైన భావాలను ఆవిష్కరిస్తుంది కాబట్టే కవయిత్రి లూయిస్‌ గ్లక్‌కు సాహిత్యరంగంలో ఈ ఏడాది ప్రతిష్టాకరమైన నోబెల్‌ పురస్కారం లభించింది. ఆ విధంగా నోబెల్‌ పురస్కారం తనను తాను గౌరవించుకుంది. 1943లో అమెరికాలోని న్యూయార్క్‌లో పుట్టిన లూయిస్‌ ప్రస్తుతం కనెక్టికట్‌లోని యాలే విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆంగ్ల సాహిత్యానికి ఆమె చేసిన సేవలు అనన్యం. అమోఘం.. 1968లో ఫస్ట్‌బార్న్‌ పేరుతో మొట్టమొదటి కవితను రాసిన లూయిస్‌ అటు పిమ్మట అనతి కాలంలోనే అమెరికా సాహిత్యరంగంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు.. ఆమె కవితలు ఎంతో మందికి ఉత్తేజం కలిగించాయి.. ఎంతో మందికి స్ఫూర్తిని రగిలించాయి.. ఇంతకుముందు ఆమె పులిట్జర్‌ అవార్డు, నేషనల్‌ బుక్‌ అవార్డులను కూడా గెల్చుకున్నారు.. ది వైల్డ్‌ ఐరిష్ అన్న పోయమ్‌కు ఆను ఆమెకు 1993లో పులిట్జర్‌ అవార్డు లభించింది. ఇప్పటి వరకు సాహిత్యరంగంలో 117 మంది నోబెల్‌ బహుమతిని గెల్చుకోగా, అందులో 16 మంది మహిళలు ఉన్నారు..