Mysterious streaks of light: ఆకాశంలో అంతుచిక్కని అద్భుత దృశ్యం.. కొన్ని సెకండ్ల పాటు కనిపించిన వెలుగు రేఖ!

|

Mar 20, 2023 | 11:01 AM

Mysterious streaks of light: ఆకాశంలో అద్భుతం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో వింత ఘటన చోటు చేసుకుంది.

Mysterious streaks of light: ఆకాశంలో అంతుచిక్కని అద్భుత దృశ్యం.. కొన్ని సెకండ్ల పాటు కనిపించిన వెలుగు రేఖ!
Mysterious Streaks Of Light
Follow us on

ఆకాశంలో అద్భుతం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆకాశంలో అంతుచిక్కని వెలుగు రేఖ స్థానికంగా కలకలం రేపింది. నీలాకాశంలో అంతుచిక్కని వెలుగులతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వింత వెలుగు రేఖ 40 సెకండ్ల పాటు కనిపించి అదృశ్యమైంది.

సెయింట్‌ పాట్రిక్‌ డే వేడుకల్లో ఉన్న వారంతా నీలాకాశంలో కనిపించిన ఆ వెలుగును సెల్‌ఫోన్‌ కెమెరాల్లో షూట్‌ చేశారు. ఆకాశంలో మండుతున్నట్టుగా కనిపించిన వెలుగు రేఖ కేవలం కొన్ని సెకండ్లపాటు కనిపించి మాయమైపోవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


హార్వార్డ్‌–స్మిత్‌సోనియాన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన జోనాథాన్‌ మెక్‌డొవెల్‌ అంతరిక్షంలో మండించే శిథిలాల్లో ఒక చిన్న తునక కావడానికి 99.9% ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. జపాన్‌కు చెందిన రిటైర్‌ అయిన కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఇటీవల మంటల్లో దగ్ధం చేశారని, దాని తాలూకు చిన్న తునక అలా కనిపించి ఉంటుందంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..