ఫస్ట్ జర్నీ ఫ్యామిలీ కోసం అంకితం, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణం ప్రపంచంలోనే ప్రత్యేకం

|

Feb 08, 2021 | 5:31 AM

అగ్రరాజ్యం అధ్యక్షుడంటే..ఆషామాషీనా!. ఏం చేయాలనుకున్నా అంతే రిచ్‌గా ఉంటుంది. అందుకే ప్రపంచానికి కొత్త పెద్దన్న బైడెన్‌ కూడా ఫస్ట్‌ టైమ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో..సింపుల్ ట్రిప్‌ని మెమరబుల్‌ జర్నీగా మార్చేసుకున్నారు...

ఫస్ట్ జర్నీ ఫ్యామిలీ కోసం అంకితం,  అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణం ప్రపంచంలోనే ప్రత్యేకం
Follow us on

అగ్రరాజ్యం అధ్యక్షుడంటే..ఆషామాషీనా!. ఏం చేయాలనుకున్నా అంతే రిచ్‌గా ఉంటుంది. అందుకే ప్రపంచానికి కొత్త పెద్దన్న బైడెన్‌ కూడా ఫస్ట్‌ టైమ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో..సింపుల్ ట్రిప్‌ని మెమరబుల్‌ జర్నీగా మార్చేసుకున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ఆ ప్రయాణం ఎందుకో తెలుసా? వైట్‌హౌస్‌లో ఇంటి అవసరాలకు కావాల్సిన లిస్ట్‌ తయారుచేయడంలో సతీమణికి సహకరించేందుకు…డెలావర్‌లోని తనింటికి వెళ్లేందుకు..అధ్యక్ష హోదాలో ఫస్ట్‌టైమ్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కారు జో బైడెన్‌. ఎలక్షన్స్‌లో పడి గ్యాప్‌ రావటంతో పనిలో పనిగా మనువళ్లు, మనువరాళ్లను కూడా చూసొచ్చారు.

అగ్రరాజ్యానికి ఎవరు అధ్యక్షుడైనా…వాడేది ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఫ్లైటే. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి అదే అధికారిక విమానం కాబట్టి. అందుకే బైడెన్ కూడా ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో ఫస్ట్‌ జర్నీని సింపుల్‌గా కానిచ్చారు. అంత భద్రతాపరమైన విమానంలో వ్యాపార అవసరాల కోసమో.. డెలిగేట్స్‌తో మీటింగ్‌ కోసమో కాకుండా…ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఫస్ట్‌ జర్నీని ఫ్యామిలీ కోసం డెడికేట్‌ చేశారు. అధ్యక్షుడి హోదాలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణించడం.. గ్రేట్ ఎక్స్‌పీయరెన్స్‌గా ఫీలయ్యారు బైడెన్. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో డెలావర్‌కు వెళ్లగానే తన ఫస్ట్ జర్నీ అనుభవాల్ని అక్కడున్న వారితో పంచుకున్నారు. 8ఏళ్ళ పాటు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఉపయోగించిన ఫ్లైట్‌లాగానే ఉన్నా…ఇప్పుడది ఇంకా బాగుందన్నారు జో బైడెన్‌.

అమెరికాలో అధ్యక్షుడి భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. చివరికి వైస్ ప్రెసిడెంట్‌ కూడా…అధ్యక్షుడితో పాటు ఆ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో వెళ్లడానికి వీల్లేదు. కరోనా గైడ్‌లైన్స్‌తో ఈ టైంలో జర్నీ చేయకపోవడమే మంచిదని సీడీసీ సూచించింది. వ్యాక్సిన్ సెకండ్‌ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాతైతే ఫర్లేదని సూచించింది. అయితే బైడెన్ వ్యాక్సిన్ తీసుకొని మూడు వారాలు కావడంతో.. నో ప్రాబ్లమ్‌ అంటూ అధ్యక్షుడి హోదాలో అధికారిక విమానం ఎక్కి ఆ ముచ్చట తీర్చుకున్నారు.

దశాబ్దకాలం పాటు సెనేట్‌లో, 8 ఏళ్ళ పాటు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జోబైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఫస్ట్‌ టైమ్‌ అధికారిక విమానం ఎక్కారు. 2000 సంవత్సరంలో తొలిసారి సౌతాఫ్రికాకి…బిల్‌క్లింటన్‌తో పాటు బైడెన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో జర్నీ చేశారు. మళ్లీ ఇప్పుడు అగ్రరాజ్య అధిపతి హోదాలో ఆ ఫ్లైట్‌ ఎక్కారు.

ఉప్పల్ వైన్స్‌ సిబ్బంది అకృత్యం, కస్టమర్ పై విచక్షణా రహితంగా దాడి, రాత్రివేళ కుప్పకూలిపోయిన వికాస్ అనే యువకుడు