బాధ పడకండంటూ.. తన టెన్త్ మార్కులు బయట పెట్టిన హీరో..

మార్కులు అనేవి జీవిత ఆశయాలను వెనక్కి తగ్గించలేవంటూ విద్యార్థులకు ధైర్యం చెప్పారు ప్రముఖ హీరో మాధవన్. తక్కువ మార్కులు వచ్చాయని బాధ పడకండంటూ.. తనకు టెన్త్ క్లాసులో వచ్చిన మార్కులను బయట పెట్టారు మాధవన్. జులై 15వ తేదీన సీబీఎస్‌ఈ 10వ తరగతి రిజల్ట్స్..

బాధ పడకండంటూ.. తన టెన్త్ మార్కులు బయట పెట్టిన హీరో..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 4:28 PM

మార్కులు అనేవి జీవిత ఆశయాలను వెనక్కి తగ్గించలేవంటూ విద్యార్థులకు ధైర్యం చెప్పారు ప్రముఖ హీరో మాధవన్. తక్కువ మార్కులు వచ్చాయని బాధ పడకండంటూ.. తనకు టెన్త్ క్లాసులో వచ్చిన మార్కులను బయట పెట్టారు మాధవన్. జులై 15వ తేదీన సీబీఎస్‌ఈ 10వ తరగతి రిజల్ట్స్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు మ్యాడీ. ‘ఈ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఎవరూ నిరాశ చెందవద్దు. నాకు టెన్త్‌లో 58 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చాయని స్టూడెంట్స్ ఎవరూ ఆందోళనకు గురి కాకండి. ఎందుకంటే ఆట ఇప్పుడే మొదలు కాలేదు మిత్రులారా’.. అంటూ గురువారం ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు మాధవన్‌కు మద్దతు ఇస్తున్నారు. మార్కులు కేవలం సంఖ్యలు మాత్రమే. తక్కువ మార్కులతో లైఫ్ ఆగిపోదు. ఎక్కువ మార్కులు భవిష్యత్తులో దేనికీ హామీ ఇవ్వదు. జీవితంలో పైకి ఎదగాలంటే.. మార్కులు ముఖ్యం కాదు, తెలివి, కరెక్ట్‌గా ఆలోచించడం, విలువలు, కష్టపడి పని చేయడం ఉంటే జీవితంలో ఇంకా పై స్థాయికి ఎదుగుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

v

Read More:

కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..