వెకిలి చేష్టలు చేశాడని.. వీపు చిత్తడి చేసిన మహిళ

Youth beaten by woman for misbehaving with her, వెకిలి చేష్టలు చేశాడని.. వీపు చిత్తడి చేసిన మహిళ

వేధింపులకు పాల్పడిన ఓ యువకుడిని చితకబాదింది ఓ మహిళ. నల్గొండ పట్టణంలోని అర్జాల బావిలో నివసిస్తున్న ఓ మహిళ పట్ల అదే ప్రాంతానికి చెందిన శ్రీశైలం అనే ఓ యువకుడు గత కొద్ది కాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. అయితే సదరు మహిళ ఇన్నాళ్లు సహిస్తూ వచ్చింది. గత నెలరోజులుగా వివాహిత ఇంటి పరిసరాల్లో సంచరిస్తూ ఇంట్లోకి తొంగి చూస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. దీంతో సీసీ కెమెరాల ద్వారా ఆకతాయి శ్రీశైలం సంచరిస్తున్నట్లు గుర్తించిన ఆమె భర్త.. ఇంటిదగ్గరకు రాగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి భార్యా భర్తలిద్దరు చితకబాదారు. విషయం తెలుసుకున్న నల్గొండ గ్రామీణ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *