Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

కాక రేపుతున్న కొరోనా వైరస్.. చైనాలో 17 మంది మృతి

wuhan is quarantine says china officials, కాక రేపుతున్న కొరోనా వైరస్.. చైనాలో 17 మంది మృతి

చైనాలో వూహాన్ (కొరోనా) వైరస్ విజృంభిస్తోంది. దీని బారిన పడి  మృతి చెందినవారి సంఖ్య 17 కు పెరగగా.. సుమారు 10 వేల మందికి  ఈ వైరస్ లక్షణాలు సోకాయి.  ఈ ప్రాణాంతక వైరస్‌కు నాంది పలికినట్టు భావిస్తున్న వూహాన్ పట్టణంలోకి ఎవరూ ఎంటర్ కారాదని,  అలాగే ఇక్కడినుంచి ఎవరూ బయటకి వెళ్లరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి చైనాలో చాంద్రమాన నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే గురువారం నుంచే ఈ నిషేధాజ్ఞలను విధించారు. ఈ డెడ్లీ వైరస్‌ని కంట్రోల్ చేయడం సాధ్యం కావడంలేదని అధికారులు దాదాపు చేతులెత్తేశారు. సార్స్ వంటి ఈ వైరస్ వ్యాధి లక్షణాలు థాయ్‌లాండ్, జపాన్, తైవాన్, సౌత్ కొరియా దేశాలతో బాటు అమెరికాలోనూ కన్పిస్తున్నాయి. అమెరికాలో సీటెల్ నగరానికి చెందిన 30 ఏళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తెలియడంతో అతడిని ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 532 మందికి స్కానింగ్ టెస్టులు చేశారని తెలుస్తోంది. కొరోనా వైరస్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించింది. అయితే ఈ సంస్థ అధికారులు గురువారం మళ్ళీ సమావేశమై ఇందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

వూహాన్ సీఫుడ్ మార్కెట్ నుంచి ఈ వైరస్ మెల్లగా ప్రారంభమైంది. ముఖ్యంగా అడవి జంతువులను చంపి వాటి శరీర భాగాలను ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు ఉన్న ప్రాంతమిది.. ఇక్కడినుంచి అమెరికాతో బాటు మరో 5 దేశాలకు వీటిని రవాణా చేస్తున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజిలిస్ విమానాశ్రయంతో బాటు అయిదు ఎయిర్‌పోర్టుల్లో స్కానింగ్ టెస్టుల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇక చైనాలోని ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది ప్రత్యేకమైన సూట్ ధరించి స్పెషల్ వార్డుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ వైరస్ సోకకుండా సిబ్బంది….  ఒక రోగిని ప్లాస్టిక్ ట్యూబులో ఉంచి ఒక విమానాశ్రయం నుంచి తరలిస్తున్న ఫోటోలను అక్కడి వెబ్ సైట్లు ప్రచురించాయి.wuhan is quarantine says china officials, కాక రేపుతున్న కొరోనా వైరస్.. చైనాలో 17 మంది మృతి

Related Tags