World COVID-19: కరోనా మృత్యుఘోష.. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన మరణాలు..

|

Apr 19, 2021 | 7:12 AM

World wide Coronavirus situation: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తుండటంతో అంతటా

World COVID-19: కరోనా మృత్యుఘోష.. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన మరణాలు..
World Covid 19 Status
Follow us on

World wide Coronavirus situation: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. కేసులతోపాటు నిత్యం వేలాది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 30లక్షలు దాటింది. అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో.. అమెరికా, బ్రెజిల్, మెక్సికో, భారత్, బ్రిటన్ ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కాటుకు ఇప్పటి వరకు 5.66 లక్షల మంది చనిపోయారు. బ్రెజిల్‌లో 3.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య 2.11లక్షలు దాటగా.. భారత్‌లో 1.75లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 1.27లక్షల మంది కోవిడ్‌తో మరణించారు.

ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14 కోట్లు దాటగా.. మరణాలు 30 లక్షలు దాటాయి. ఇప్పటివరకూ 14,19,94,885 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి కారణంగా 30,32,671 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 12,05,25,483 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,84,36,731 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల పరంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ ఉన్నాయి. ఇదిలాఉంటే.. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత మూడు రోజుల నుంచి నిత్యం లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు చాలా రోజుల తర్వాత నిన్న రికార్డు స్థాయిలో 15 వందల మరణాలు సంభవించాయి.

 

Also Read:

Texas Shooting: అమెరికాలో తీవ్రస్థాయికి చేరిన గన్ కల్చర్.. దుండగుడి కాల్పుల్లో మరో ముగ్గురు మృతి

Check to China: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా భారీ వ్యూహం.. జపాన్‌తో కలిసి కొత్త వ్యూహరచనలో బైడెన్