భారత్ పై నోరు పారేసుకున్న ఇమ్రాన్

|

Aug 19, 2019 | 5:38 PM

భారత్ ఎంత చెబుతున్నా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. అంతర్జాతీయ సమాజంలో భారత్ ను దోషిగా నిలబెట్టాలన్నఆయన లక్ష్యం నెరవేరకపోవడంతో ఇప్పుడు రూటు మార్చారు.  భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. ఎన్ఆర్సీ, అణ్వస్త్ర విధానంపై కొత్త వాదనకు తెరలేపారు. భారత అణ్వస్త్ర విధానంతో పాకిస్తాన్ తో పాటు సరిహద్దు దేశాలకు ముప్పుందని నిరాధార ఆరోపణలు చేశారు..దీనిపై దీనిపై అంతర్జాతీయ సమాజం కలగజేసుకోవాలని అన్నారు. ముందుగా అణ్వస్త్రాలను ప్రయోగించమన్న విధానానికి కట్టుబడి […]

భారత్ పై నోరు పారేసుకున్న ఇమ్రాన్
Follow us on

భారత్ ఎంత చెబుతున్నా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. అంతర్జాతీయ సమాజంలో భారత్ ను దోషిగా నిలబెట్టాలన్నఆయన లక్ష్యం నెరవేరకపోవడంతో ఇప్పుడు రూటు మార్చారు.  భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. ఎన్ఆర్సీ, అణ్వస్త్ర విధానంపై కొత్త వాదనకు తెరలేపారు. భారత అణ్వస్త్ర విధానంతో పాకిస్తాన్ తో పాటు సరిహద్దు దేశాలకు ముప్పుందని నిరాధార ఆరోపణలు చేశారు..దీనిపై దీనిపై అంతర్జాతీయ సమాజం కలగజేసుకోవాలని అన్నారు. ముందుగా అణ్వస్త్రాలను ప్రయోగించమన్న విధానానికి కట్టుబడి ఉన్నామని..ఐతే అది భవిష్యత్ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని ఇటీవల వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.  దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

కశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇమ్రాన్. ఐరాసలోనూ చైనా మినహా ఇతర దేశాలు మద్దతివ్వకపోవడంతో నిరుత్సాహానికి గురైన ఇమ్రాన్.. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తానని గద్దెనెక్కిన ఇమ్రాన్..అలాంటి చర్యలేవీ తీసుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఆ దేశ ప్రజలు. దీంతో వారి దృష్టిని మరల్చేందుకు భారత్ పై విషం చిమ్ముతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.