Donald Trump Warning: ఇరాన్‌కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్.. కౌంటర్ ఇచ్చిన ఇరాన్!
Donald Trump Warning: ఇరాన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ ఇవాళ రాత్రి ముగుస్తుందని, తమ మాట వినకుంటే ఇరాన్ నాగరికత ఇవాళ రాత్రి అంతరించిపోతుందని ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు ట్రంప్. తాను అలా..

Donald Trump Warning: ఇరాన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ ఇవాళ రాత్రి ముగుస్తుందని, తమ మాట వినకుంటే ఇరాన్ నాగరికత ఇవాళ రాత్రి అంతరించిపోతుందని ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు ట్రంప్. తాను అలా జరగాలని కోరుకోవడం లేదన్నారు. అయితే ఈ రోజు రాత్రి అద్భుతం జరిగే అవకాశం ఉందని, ఇరాన్‌లో కొత్త నాయకత్వం వచ్చిందని పేర్కొన్నారు. ఇరాన్‌లో 47 ఏళ్ల నియంతృతం అంతరించే అవకాశం ఉందన్నారు ట్రంప్. ఇరాన్‌లో అవినీతి అంతం చేస్తామన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలని ట్రూత్‌లో పేర్కొన్నారు ట్రంప్. అయితే ఇరాన్ ఒప్పందానికి రావడానికి మంగళవారం వాషింగ్టన్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల వరకు ఇరాన్‌కు ట్రంప్ గడువు ఇచ్చారు. ఇరాన్ ఇంకా ఒప్పందానికి అంగీకరించలేదు.

Trump Warning
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్
ఇదిలా ఉండగా, ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలకు భయపడేది లేదని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా మేం దాడులు చేయగలం.. దేశ రక్షణగా ప్రజలు మానవహారం నిర్వహిస్తారు. భవిష్యత్తులో అమెరికాతో చర్చలు ఉండవు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది ఇరాన్. అలాగే ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించమని పేర్కొంది. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని ఇరాన్ పేర్కొంది.
