
బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడింది. వెలుగు చూసిన ఈ కొత్త రకం వైరస్ పై తమకు అవగాహన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు వెయ్యి మందిలో దీనిని గుర్తించినట్లు సమాచారం అందినట్లు తెలిపింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కరోనా కంటే భిన్నంగా వ్యవహరిస్తుందడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని సంస్థ ఉన్నతాధికారి మైకేల్ ర్యాన్ తెలిపారు. ఇప్పటికే అనేక రకాల కరోనా వైరస్ లను గుర్తించామని తెలిపారు. సమయం గడుస్తున్నకొద్ది వైరస్ రూపాంతరం చెందుతోందని పేర్కొన్నారు.
అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం
కాగా, ఈ కొత్త రకం వైరస్ ను గుర్తించడంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లండన్ లో రోజువారీ కేసుల భారీగా సంఖ్య పెరిగిపోతోంది. కొత్తగా గుర్తించిన కరోనా వైరస్ రకమే వేగవంతమైన వ్యాప్తికి కారణమై ఉండవచ్చని నిపుణులు భావిస్తు్న్నారు. ఈ నేపథ్యంలో లండన్ మరిన్ని ఆంఓలు విధిస్తున్నట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో థియేటర్లు, పబ్ లు, రెస్టాంరెంట్లు, ప్రజలు అధికంగా ఉండే ప్రదేశాలను మూసివేయనున్నారమని తెలిపారు.
గత వారమే బ్రిటన్ లో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ను అత్యవసర వినియోగం కింద ప్రజలకు అందజేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య వర్కర్లు, వృద్దులకు ఇస్తున్నారు.