Huanan Seafood Market: కరోనా వైరస్ పుట్టినిల్లు హూనన్‌ వెట్ మార్కెట్‌ను సందర్శించిన డబ్ల్యూహెచ్‌ఓ బృందం

చైనాలో పుట్టిన కరోనా వైరస్ పై ప్రపంచ దేశాల నుంచి భిన్నవాదనలు వినిపించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ వంటి దేశాలు అయితే డైరక్ట్ గా ఇది చైనా పనే..

Huanan Seafood Market: కరోనా వైరస్ పుట్టినిల్లు హూనన్‌ వెట్ మార్కెట్‌ను సందర్శించిన డబ్ల్యూహెచ్‌ఓ బృందం

Updated on: Feb 01, 2021 | 1:08 PM

Huanan Seafood Market: చైనాలో పుట్టిన కరోనా వైరస్ పై ప్రపంచ దేశాల నుంచి భిన్నవాదనలు వినిపించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ వంటి దేశాలు అయితే డైరక్ట్ గా ఇది చైనా పనే అంటూ విరుచుకుపడ్డాయి. అయితే కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ బృందాన్ని ఏర్పటు చేసి చైనాలో పర్యటించడానికి పంపింది. తాజాగా ఆ బృందం లోని 14 మంది సభ్యుల నిపుణులు కరోనా పుట్టినిల్లు అయిన వూహాన్‌లో పర్యటిస్తున్నారు.

హూనన్‌ వెట్  మార్కెట్‌ను పటిష్టమైన భద్రత మధ్య డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం సందర్శించింది. గత ఏడాది జనవరిలో కరోనా వైరస్‌ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందన్న విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ బృందం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వెట్ మార్కెట్‌లో సముద్ర జీవులతో పాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాల నుంచే కరోనా వైరస్‌ పుట్టిందన్న వాదన ఉంది. అయితే, దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ ప్రాంతంలో తమ పర్యటన కరోనా వ్యాప్తిని గుర్తించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నామని డబ్ల్యూహెచ్‌ఓ బృందం పేర్కొంది.

Also Read: ఆ నగరంలో బయల్పడ్డ ఒక్క కేసు..ఐదు రోజులు లాక్ డౌన్.. రెండు మిలియన్ల ప్రజలపై ఎఫెక్ట్