క్వారంటైన్‌లోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్‌ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కొవిడ్‌ 19 పాజిటివ్‌గా తేలిన

క్వారంటైన్‌లోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

Edited By:

Updated on: Nov 02, 2020 | 1:04 PM

Tedros Adhanom Corona: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్‌ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కొవిడ్‌ 19 పాజిటివ్‌గా తేలిన ఒక వ్యక్తి ఇటీవల టెడ్రోస్‌ని కలిశారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని అధనామ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి లక్షణాలు లేవని ఆయన తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం.. కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నట్లు అధనామ్‌ పేర్కొన్నారు. అప్పటి వరకు ఇంటి నుంచే పని చేస్తానని స్పష్టం చేశారు.

Read More:

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా రావు

షాకింగ్‌.. యువ సంగీత దర్శకుడు హఠాన్మరణం